ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో నిజానిజాలు తెలుసుకోకుండా పుకార్లను నమ్మడం ఎంత ప్రమాదకరమో తెలియజేసే చిత్రమే…
“ఆలోచన” చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన పద్మశ్రీ మురళి మోహన్

పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ లో ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం “ఆలోచన”.
సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత మరియు నూతన పరిచయం సీనియర్ నటుడు సుధాకర్ గారి అబ్బాయి బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను పద్మశ్రీ మురళి మోహన్ గారు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మురళి మోహన్ గారు మాట్లాడుతూ … అద్భుతమైన నటుల కాంబినేషన్ తో స్నేహం పై ఒక మంచి కాన్సెప్ట్ తో ఆలోచన చేశారని మంచి సంకల్పం తో నిర్మాతలు ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన సినిమాను నిర్మించారు అని ప్రశంసించారు. ఈ చిత్రానికి సాంకేతిక వర్గం కెమెరా: టి. సురేంద్ర రెడ్డి, సంగీతం: వియాన్ , పాటలు: ప్రతాప్ రాజులపల్లి, ఎడిటర్: ఆర్.ఎల్.వర్మ, ఆర్ట్: గిరీష్ దేవాంగ్, ఈ.పి: సీ.హెచ్.విజయ్ కుమార్.
మంచి కథాబలం ఉన్న “ఆలోచన” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, ఈ సినిమా విజయం సాధించి, చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు” తెలిపారు.
షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆలోచన” చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ , ట్రైలర్ త్వరలో విడుదల కానున్నాయి.

