Skip to content

‘ది ఇండియా స్టోరీ’ హార్డ్ హిట్టింగ్ టీజర్ రిలీజ్

కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పురుగుమందుల ఆధారిత వ్యవసాయం (పెస్టిసైడ్ ఫార్మింగ్) వల్ల సమాజంపై పడుతున్న తీవ్ర ప్రభావాన్ని ఈ చిత్రం ప్రధానాంశంగా తీసుకుంది. రోజూ కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న ఈ సమస్యపై అవగాహన కల్పించడమే ఈ సినిమా లక్ష్యం.

జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్‌తో కలిసి రూపొందుతున్న ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. సాగర్ బి. షిండే కథ, నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

టీజర్‌లో కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే న్యాయం కోసం పోరాడుతూ, పురుగుమందుల ఆధారిత వ్యవసాయం వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలను వెలికితీసే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా ఉంది. రోజువారీ ఆహారంలోకి చేరుతున్న విషపూరిత రసాయనాలు, ముఖ్యంగా యువత ఆరోగ్యంపై చూపుతున్న తీవ్ర ప్రభావాన్ని టీజర్ ఆవిష్కరించింది. భావోద్వేగాలతో పాటు సామాజిక బాధ్యతను ప్రతిబింబించే కథతో, తరచూ మన దృష్టికి రాని ఒక కీలక సమస్యను ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు చేతన్ డీకే మాట్లాడుతూ, “‘ది ఇండియా స్టోరీ’ కేవలం సినిమా మాత్రమే కాదు… సమాజంగా మనమందరం చర్చించాల్సిన అంశం. పురుగుమందుల ఆధారిత వ్యవసాయం వల్ల ఏర్పడుతున్న నిశ్శబ్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఈ కథ ద్వారా వెలుగులోకి తీసుకురావాలనుకున్నాం. టీజర్‌లో మీరు చూసింది అసలు సమస్యలో చిన్న భాగం మాత్రమే. ప్రతిరోజూ లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేస్తున్న ఈ సమస్యపై అవగాహన కల్పించడం, ప్రేక్షకులను ఆలోచింపజేయడం, తమ తినే ఆహారం గురించి ప్రశ్నించేలా చేయడమే మా లక్ష్యం”

శ్రేయాస్ తల్పడే మాట్లాడుతూ..ఈ కథలో నన్ను ఆకర్షించింది ప్రస్తుత ప్రాముఖ్యత. పురుగుమందుల వ్యవసాయం ప్రతి ఇంటినీ ప్రభావితం చేస్తున్న సమస్య. అయినప్పటికీ దాని దీర్ఘకాలిక పరిణామాల గురించి మనం పెద్దగా ఆలోచించం. ఈ చిత్రంలో నా పాత్ర ద్వారా వ్యవస్థతో పోరాడే ఒక సాధారణ తండ్రి భావోద్వేగాలను ప్రేక్షకులు అనుభూతి చెందుతారని ఆశిస్తున్నాను. ఇది వినోదాన్ని అందించడమే కాదు… సమాజంలో ఒక ముఖ్యమైన చర్చకు నాంది పలికే చిత్రం”

కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ, “‘ది ఇండియా స్టోరీ’ బలమైన సామాజిక సందేశంతో రూపొందిన సినిమా. ఒక తల్లిగా ఈ కథ నాకు చాలా వ్యక్తిగతంగా కనెక్ట్ అయింది. నేటి తల్లిదండ్రులందరిలో ఉన్న ఆందోళనలు, భయాలను ఇది ప్రతిబింబిస్తుంది. టీజర్ ప్రజలకు తెలియని ఒక వాస్తవాన్ని చూపిస్తుంది. మనం తీసుకునే ఆహారం, అది భవిష్యత్ తరాలపై చూపే ప్రభావం గురించి ఈ సినిమా ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని ఆశిస్తున్నాను”

ఈ చిత్రానికి స్వాతి వినాయక్ సైందానే, అనితా జాధవ్, వినాయక్ సైందానే, కల్పేష్ షా, దేవ్యాని ఖోరాటే, ప్రేమ్ జోషి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నిశాంత్ భగవత్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మంగేష్ ధాక్డే సంగీతం సమకూరుస్తున్నారు. ఆశిష్ మాథ్రే ఎడిటర్‌గా, షకీల్ ఆజ్మీ గీత రచయితగా, అన్మోల్ భావే సౌండ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

Teaser link – https://youtu.be/Yw2eyEPV9Fs

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.