Skip to content

హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఫ్రాంఛైజీ ద్వారా వాలీబాల్ ప్లేయర్స్ ను సపోర్ట్ చేసి ప్రశంసలు పొందుతున్న హీరో విజయ్ దేవరకొండ

ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ మెన్స్ కప్ లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించిన ఇండియన్ వాలీబాల్ టీమ్

ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ మెన్స్ కప్ లో భారత వాలీబాల్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి కాంస్య పతకాన్ని గెలిచి సత్తా చాటింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఈ టోర్నమెంట్ లో భారత వాలీబాల్ జట్టు మూడో స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచింది. ఇది దేశంలో వాలీబాల్ ఆటకు మరింత ఆదరణ తీసుకురానుంది. భారత వాలీబాల్ జట్టు ఈ అద్భుత విజయం సాధించడం వెనక పలు నగరాల పేరుతో ఏర్పాటు చేసుకున్న ఫ్రాంఛైజీలు, ఆ ఫ్రాంఛైజీలతో గత నాలుగేళ్లుగా జరుగుతున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ కారణమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అలాంటి ఫ్రాంఛైజీలలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ కూడా కీలక జట్టుగా పోటీ పడుతోంది.

హైదరాబాద్ బ్లాక్ హాక్స్ కో ఓనర్ గా హీరో విజయ్ దేవరకొండ గత కొన్నేళ్లుగా వాలీబాల్ ప్లేయర్స్ ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఇండియన్ వాలీబాల్ టీమ్ సృష్టించిన చరిత్ర వెనక విజయ్ దేవరకొండ లాంటి ఫ్రాంఛైజీ ఓనర్స్ కృషి ఎంతో ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు స్పోర్ట్స్ లవర్స్. ప్రైమ్ వాలీబాల్ లీగ్ వచ్చిన తర్వాతే దేశవ్యాప్తంగా 10 ఫ్రాంఛైజీలు పోటీ పడటంతో క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని వారంటున్నారు. మన వాలీబాల్ ప్లేయర్ గొప్ప విజయాలు సాధిస్తారని, దేశం తరుపున ఆడి పేరు తీసుకొస్తారనే నమ్మకంతోనే హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఫ్రాంఛైజీ తీసుకుని ఎంకరేజ్ చేస్తున్నట్లు విజయ్ దేవరకొండ గతంలోనే తెలిపారు.

ప్రస్తుతం టీజీ 20 లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ క్రికెట్ లో మన లోకల్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న విజయ్ దేవరకొండ, కొన్నేళ్లుగా హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఫ్రాంఛైజీ ద్వారా మన వాలీబాల్ ప్లేయర్స్ ను సపోర్ట్ చేస్తున్నారు. కొత్త తరం క్రీడాకారులకు తన వంతు సహకారం అందిస్తున్న విజయ్ దేవరకొండపై సోషల్ మీడియాలో అప్రిషియేషన్స్ లభిస్తున్నాయి. తెరపై లక్షలాది మందిని తన సినిమాలతో ఎంటర్ టైన్ చేస్తున్న విజయ్, నిజ జీవితంలో బలమైన క్రీడా సంస్కృతిని తీసుకొస్తున్నారు. తన సినిమాల్లో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ, తనతో పనిచేసిన దర్శకులకు సపోర్ట్ గా నిలుస్తూ, క్రీడాకారులకు మద్ధతిస్తూ వారంతా ఎదిగేలా ప్రయత్నిస్తున్న విజయ్ దేవరకొండ రియల్ హీరోగా పేరు తెచ్చుకుంటున్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.