గత కొన్ని రోజులగా డాన్సర్ అసోసియేషన్ వివాదం గురించి వింటూనే ఉన్నాము. కాగా నేడు ఈ…
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది: హీరో శ్రీకాంత్
శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ బిగ్ ఫన్ హిట్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్. జూలై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
సక్సెస్ మీట్ లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. సరదాగా థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకుల మధ్య సినిమా చూసి ఇంతగా ఎంజాయ్ చేసి చాలా సంవత్సరాలు అయింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. వైజాగ్, కర్ణాటకలోని బళ్లారి నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చేశామనే ఆనందంగా ఉంది. త్వరలో మరో సక్సెస్ మీట్ కూడా నిర్వహిస్తాం. ఇది ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. ఒక భక్తుడికి, భగవంతుడికి మధ్య జరిగే కథను చాలా ఆసక్తికరంగా చూపించాం. దేవుడు భూమిపైకి రావాలంటే భక్తి ఎంత గొప్పదో ఈ సినిమాలో చూస్తారు. ఈ సినిమాకు అసలు హీరో వెంకటేశ్వరస్వామి. ఆ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ గారు అద్భుతంగా నటించారు. ప్రతి పాత్రను, ప్రతి పంచ్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి గారు థియేటర్‌ను ఒక దేవాలయంలా మార్చేశారు. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. థియేటర్‌లో సినిమా చూస్తుంటే చాలా గొప్ప అనుభూతి కలుగుతోంది. ప్రతి ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. సినిమాకు వస్తున్న పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఎంతో ఆనందంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చూడాల్సిన సినిమా. మరోసారి ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.”
దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… సినిమా చాలా బాగుంది. ఎవరూ మిస్ అవ్వకండి. ఈరోజు కలెక్షన్స్ చూసి మాకు చాలా ఆనందంగా అనిపించింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు 60 నుంచి 70 శాతం వరకు గ్రోత్ కనిపించింది. రేపు అది 100 శాతానికి చేరాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి సందేశం కూడా ఉంది. మీరందరూ థియేటర్లకు వచ్చి సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. అందరికీ థ్యాంక్యూ వెరీ మచ్.”
నిర్మాత చందు మాట్లాడుతూ… ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇంకా చూడని ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ… ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లు ఇలా అన్ని చోట్ల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. సంగీతానికి కూడా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
డీవోపీ అంజి మాట్లాడుతూ… ఈ సినిమా మేము అనుకున్నట్టుగానే అద్భుతమైన హిట్ అయింది. చాలా రోజుల తర్వాత ఇలాంటి సక్సెస్ మీట్‌లో కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఇందులో ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఒక మంచి సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.
మురళి గౌడ్ మాట్లాడుతూ… మిస్టర్ మిడిల్ క్లాస్’ విజయవంతం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మంచి సినిమా ఎప్పుడూ బాగా ఆడుతుందని మరోసారి మీరు నిరూపించారు. ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధించాలని, మీరంతా మరింత ఆదరించాలని కోరుకుంటున్నాను.

