Skip to content

“పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్” సినిమా ఫస్ట్ సింగిల్ ‘మెగా సాంగ్..’ రిలీజ్

“పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్” సినిమా ఫస్ట్ సింగిల్ ‘మెగా సాంగ్..’ రిలీజ్

‘విరూపాక్ష’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు సోదరుడు వివేక్ దండు హీరోగా పరిచయమవుతున్న సినిమా “పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్”. ఈ చిత్రంలో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. సప్తగిరి ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని క్యాండిడ్ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ప్రొడ్యూసర్ వివేకానంద్ వర్మ నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని దర్శకుడు సి.హెచ్. రవికిషోర్ రూపొందిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయనకు ట్రిబ్యూట్ గా “పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్” సినిమా మేకర్స్ తమ సినిమా ఫస్ట్ సింగిల్ ‘మెగా సాంగ్’ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో హీరో వివేక్ దండు మెగా కామ్రేడ్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పనసపల్లి రాజు పాత్రలో కనిపించనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ రోజున ఆయన అభిమాని అయిన పనసపల్లి రాజు, ఆయన మిత్రులు థియేటర్స్ దగ్గర చేసే సందడి నేపథ్యంగా ‘మెగా సాంగ్’ ను రూపొందించారు. ఈ పాటలో ‘ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్, ఆడెవడన్నా ఈడెవడన్నా మెగాస్టార్ కు అడ్డెవడన్నా, ఒకటి రెండు మూడు, మా బాస్ ముందు ఎవడు..పనసపల్లి రాజు గాని అడ్డరా, చిరంజీవి తెలుగు ముద్దు బిడ్డరా, బాసుకు దండేసి బొట్టు పెట్టరా, దుమ్ములేసి పోద్ది చూడు జాతరా..’ వంటి మెగా ఫ్యాన్స్ చెప్పే స్లోగన్స్ నే లిరిక్స్ గా ‘మెగా సాంగ్’ డిజైన్ చేయడం విశేషం. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా మాంచి మాస్ బీట్ తో కంపోజ్ చేశారు. ఈ పాటలో మెగాభిమానిగా హీరో వివేక్ దండు మాస్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు.

రీసెంట్ గా రిలీజ్ చేసిన “పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్” సినిమా మోషన్ పోస్టర్ మూవీ లవర్స్ దృష్టిని బాగా ఆకర్షించింది. ఇప్పుడీ సాంగ్ కూడా ఇన్ స్టంట్ గా రీచ్ అయ్యేలా కనిపిస్తోంది.

నటీనటులు – వివేక్ దండు, సంగీర్తన విపిన్, సప్తగిరి, రాజా రవీందర్, బాబు మోహన్, వంశీధర్ గౌడ్, షైనింగ్ ఫణి, జబర్దస్త్ అశోక్, జబర్దస్త్ అప్పారావు, తదితరులు

టెక్నీషియన్స్
————————
ఎడిటర్ – నరేష్ అడుపా
డీవోపీ – మోహన్ చారి
మ్యూజిక్ డైరెక్టర్ – ఎంఎల్ రాజా
బ్యానర్ – కాండిడ్ ఫిలింస్
ప్రొడ్యూసర్ – పి.వివేకానంద్ వర్మ
స్క్రిప్ట్, డైరెక్టర్ – సి.హెచ్. రవికిషోర్
పీఆర్ఓ – సురేష్ ( ఎస్ కె మీడియా )

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.