ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘డాయ్రా’ చిత్ర బృందం న్యూ అప్డేట్ ఇచ్చింది. కరీనా…
“ఇడుపు కాయితం” నుంచి ‘శ్రీలత సాంగ్’ ప్రోమో రిలీజ్
ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా “ఇడుపు కాయితం”. ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా “ఇడుపు కాయితం” సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు.
ఈ రోజు హీరో ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయనకు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ “ఇడుపు కాయితం” సినిమా నుంచి ‘శ్రీలత సాంగ్..’ ప్రోమో రిలీజ్ చేశారు. కొత్తగా పెళ్లయిన జంట శ్రీలత, శ్రీనివాస్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ గా ఈ పాటను చిత్రీకరించారు. ఈ సాంగ్ ప్రోమో ఎలా ఉందో చూస్తే – ‘ఓ శ్రీలత శ్రీలత శ్రీలత నువ్వు సిన్నబోకే నా శ్రీలత, ఓ శ్రీలత శ్రీలత శ్రీలత నువ్వు సిన్నబోకే నా శ్రీలత, శ్రీలత శ్రీలత శ్రీలత ఈ శ్రీనివాసుడే నీ జత’ అని ఆకట్టుకునేలా సాగుతుంది. త్వరలో ఈ పాట ఫుల్ వెర్షన్ రిలీజ్ చేయనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మంచి మెలొడీ ట్యూన్ తో ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు.
“ఇడుపు కాయితం” సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో దర్శక నిర్మాతలు షేర్ చేసుకోనున్నారు.
నటీనటులు – ప్రియదర్శి, నాగదుర్గ, శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు, తదితరులు
టెక్నికల్ టీమ్
————————–
కాస్ట్యూమ్ డిజైనర్ – అశ్వత్ భైరి
ఆర్ట్ డైరెక్టర్ – ఆశిష్ తేజ
ఎడిటర్ – శ్రీధర్ సొంపల్లి
డీవోపీ – ఎంఎన్ బాల్ రెడ్డి
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
బ్యానర్స్ – సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ వర్క్స్
ప్రొడ్యూసర్ – బన్నీవాస్
స్క్రిప్ట్, డైరెక్షన్ – వంశీరెడ్డి దొండపాటి
మార్కెటింగ్ – విష్ణు తేజ్ పుట్ట
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా), మడూరి మధు

