ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్,…
ఆగస్టు 31న ‘డాయ్‌రా’ ట్రైలర్ విడుదల
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘డాయ్‌రా’ చిత్ర బృందం న్యూ అప్‌డేట్ ఇచ్చింది. కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో కాంబినేషన్‌లో ఒక పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌తో సినిమా ఎలా ఉండబోతోందనే హింట్‌ను టీం ఇచ్చింది. ఆగస్టు 31న ట్రైలర్ విడుదల కానున్న తరుణంలో ఈ పోస్టర్, అందులోని హింట్స్ అన్నీ కూడా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసేలా ఉన్నాయి. కథ పట్ల ఆసక్తిని రేకెత్తించేలా కొన్ని అంశాలను రివీల్ చేస్తూనే ఆ పాత్రల మధ్య ఉన్న సంబంధం గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తేలా పోస్టర్ ఉంది.
పోలీసుల హెచ్చరిక టేప్ (police tape) మధ్య, ఒకరికొకరు వ్యతిరేకదిశలో నిలబడి ఉన్న కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో పాటు, బ్యాక్ గ్రౌండ్‌లో అస్పష్టంగా కనిపించే ఒక ముఖం ఈ పోస్టర్‌లో ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పోస్టర్ ప్రేక్షకులలో కుతూహలాన్ని కలిగించేలా ఉంది. ఇది రెండు భిన్నమైన దృక్పథాలను సూచిస్తూ, ఆ పాత్రల మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఏముంది అనే విషయాలపై ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది.
పోస్టర్‌లో మనం చూస్తున్న దానికి..మనకు కనిపించకుండా దాగి దాగి ఉన్నదానికి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. సమాధానాలు మాత్రం ఇంకా రహస్యంగానే ఉండిపోయేలా పోస్టర్‌ను చాలా చక్కగా డిజైన్ చేశారు. ట్రైలర్‌లో కొన్ని సమాధానాలు దొరికే అవకాశం ఉన్నా.. మరిన్ని ప్రశ్నలు తలెత్తే ఛాన్స్ కూడా ఉంటుంది. జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తోంది. అదే సమయంలో ‘తల్వార్’, ‘రాజీ’ తర్వాత జంగ్లీ పిక్చర్స్‌తో మేఘనా గుల్జార్ మూడో సారి కలిపి పని చేస్తున్నారు. ఇది కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికతో వస్తున్న మొదటి చిత్రం.
యదార్థ ఘటనల నుండి ప్రేరణ పొందిన ‘డాయ్‌రా’ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత చిత్రనిర్మాత మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని యశ్ కేశ్వాని, సీమా అగర్వాల్, మేఘనా గుల్జార్ రచించారు. సత్యం, న్యాయం, జవాబుదారీతనం కలిసే ఒక ఉత్కంఠభరితమైన కథను ‘డాయ్‌రా’ అందిస్తుందని టీం వాగ్దానం చేస్తుంది. జంగ్లీ పిక్చర్స్, డాక్టర్ జయంతిలాల్ గాడా (పెన్ స్టూడియోస్) నిర్మించగా ఈ మూవీని పెన్ మరుధర్ పంపిణీ చేయనుంది. ‘డాయ్‌రా’ సెప్టెంబర్18, 2026న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

