ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘డాయ్‌రా’ చిత్ర బృందం న్యూ అప్డేట్ ఇచ్చింది. కరీనా…
‘జగమే సంగీతం’ ట్రైలర్ విడుదల
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ‘జగమే సంగీతం’. ఈ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ స్ట్రీమింగ్ సర్వీస్ ఒరిజినల్ హిందీ సిరీస్ ‘బందిష్ బాండిట్స్’ స్ఫూర్తితో రూపొందించారు. ఈ సిరీస్ కుటుంబం, సంప్రదాయం, ఆత్మశోధనకు సంబంధించిన ఒక హృద్యమైన కథను మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. ఇందులో వారసత్వం, ప్రేమ, స్వీయ వాణిని కనుగొనడం గురించిన కథకు కర్ణాటక సంగీతం శాశ్వత సౌందర్యం భావోద్వేగ ప్రధానాంశంగా నిలుస్తుంది.
గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మాణంలో పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల మ్యూజికల్ డ్రామాకు వంగాల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఎ.ఆర్. ప్రభావ్ రచన చేయగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ సిరీస్‌కు సంగీతం వెన్నెముకగా నిలుస్తుంది. కర్ణాటక సంగీత సంప్రదాయాలను సమకాలీన అంశాలతో అందంగా మేళవించి, హృద్యమైన స్వరకల్పనలతో దీనిలోని గాఢమైన భావోద్వేగ ప్రపంచానికి జీవం పోస్తుంది. ఈ సిరీస్‌లో ప్రకాష్ రాజ్, మేక శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుష్మిత శెట్టి ప్రధాన పాత్రలలో నటించగా, సుమన్, సిజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ, రఘు బాబు యెర్రా, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, మిర్చి కిరణ్, కేశవ్ దీపక్, ప్రియాంక నల్కరి, మాణిక్ రెడ్డి, ప్రాచీ థాకర్, రూపా లక్ష్మి కీలక పాత్రలలో నటించారు. ‘జగమే సంగీతం’ సెప్టెంబర్ 4, 2026న భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు, ప్రాంతాలలో ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా ప్రసారం కానుంది. ఇది తెలుగులో ఆంగ్ల సబ్‌టైటిల్స్‌తో, తమిళ డబ్బింగ్‌తో వస్తుంది.
‘ఇదే మన వైకుంఠపురం.. ముప్పై ఏళ్ల తర్వాత సంగీత భారతిని నిర్ణయించే సమయం వచ్చింది’ అంటూ తణికెళ్ల భరణి వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది.. ‘స్వచ్ఛమైన సంగీతమే నా ఉఛ్వాసం, నిశ్వాసం.. ఎన్ని పాశ్చాత్య సంగీత పిల్ల కాలువలు పుట్టినా.. అన్నింటికీ అమ్మ శాస్త్రీయ సంగీతమే’.. అని ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్.. ‘సంగీతాన్ని నీ కొడుకు, మనవడు రోడ్డున పడేశాడు.. శాస్త్రి గారు ఇప్పుడు ఏం చేస్తారో మరి’ అని శ్రీకాంత్ చెప్పిన డైలాగ్ చూస్తుంటే కథలోని సంఘర్షణ ఏంటో అర్థం అవుతోంది. ‘శ్రుతి తప్పితేనే ఊరుకోను, గతి తప్పావ్’ అని ప్రకాష్ రాజ్ అన్న మాటలు ‘సంగీతం అనేది వారసత్వం కాదు, వరం’, ‘స్వచ్ఛమైన సంగీతం, నిజమైన ప్రేమ పారదర్శకంగా ఉంటాయి’ అని మధుబాల చెప్పిన డైలాగ్స్‌తో సాగిన ఈ ట్రైలర్ ఫ్యామిలీ ఎమోషన్స్, శాస్త్రీయ సంగీతానికి ఉన్న గొప్పదనాన్ని చూపించేలా ఉన్నాయి. బాలు, పల్లవి మధ్య సాగే మోడ్రన్ లవ్ స్టోరీ కథకు ప్రాణంలా నిలుస్తుంది.
ఈ ట్రైలర్ జగమేసంగీతం ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని అందరినీ తీసుకు వెళ్తుంది. ఇక్కడ కర్ణాటక సంగీతం కేవలం ఒక కళారూపం మాత్రమే కాదు. అది వారసత్వం, గుర్తింపు, తరతరాలను కలిపి ఉంచే బంధం. వైకుంఠపురం అనే దేవాలయ పట్టణంలో సాగే ఈ కథ, రెండు విభిన్న ప్రపంచాల చుట్టూ తిరుగుతుంది. ఒకవైపు, ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు శాస్త్రి గారి ప్రతిభావంతుడైన మనవడు బాలు, తనకంటూ ఒక ప్రత్యేక గొంతును వెతుకుతూనే, తన ప్రసిద్ధ సంగీత వారసత్వాన్ని నిలబెట్టడానికి పోరాడుతుంటాడు. మరోవైపు కీర్తి ఒత్తిళ్ల నుండి విముక్తి పొంది, మరింత ప్రామాణికమైన దాని కోసం అన్వేషిస్తున్న ప్రసిద్ధ పాప్ స్టార్ పల్లవి ఉంటుంది. వారి విభిన్న ప్రపంచాలు అనుకోకుండా కలుసుకున్నప్పుడు, చిరకాలంగా ఉన్న వైరుధ్యాలు తీవ్రమవుతాయి. దాగివున్న నిజాలు బయటపడటం మొదలవుతాయి, సంబంధాలు మునుపెన్నడూ లేని విధంగా పరీక్షించబడతాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతంతో కూడిన ఈ ట్రైలర్, వారసత్వం, ప్రేమ, త్యాగం, సొంత మార్గాన్ని నిర్దేశించుకునే ధైర్యం గురించి చెప్పే ఒక ఆసక్తికరమైన కుటుంబ నాటకాన్ని అందిస్తుందని వాగ్దానం చేస్తుంది.
దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ ..‘‘జగమే సంగీతం’ చిత్రంలో అద్భుతమైన కథతో పాటు, ఆ కథకు ప్రాణం పోసే సంగీతం కూడా ఉంటుంది. ఈ కథను చెప్పడానికి కర్ణాటక సంగీతం సరైన భావోద్వేగ భాషగా మారింది. కర్ణాటక సంగీతం తరతరాల సంప్రదాయాన్ని మోస్తూనే, ప్రతి కళాకారుడికి తమదైన వ్యక్తిగత అనుభూతిని అందించడానికి అవకాశం కల్పిస్తుంది. ‘జగమే సంగీతం’ సినిమా ప్రేమ, ఆశలు, గుర్తింపు, జీవితం, ఫ్యామిలీ ఎమోషన్స్‌కి సంబంధించిన అంశాలను చూపిస్తుంది. ఆర్టిస్టులంతా కూడా ఈ కథకు ప్రాణం పోశారు. విశాల్ సంగీతం పాత్రలన్నంటినీ కలిపే దారంగా మారింది. ప్రేక్షకులు కేవలం సంగీతంతోనే కాకుండా, ఈ పాత్రలు సాగించే భావోద్వేగ ప్రయాణంతో కూడా కదిలిపోతారని నేను ఆశిస్తున్నాను’ అని అన్నారు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ .. ‘శాస్త్రి పాత్రలో ఉండే క్రమశిక్షణ నన్ను ఎక్కువగా ఆకర్షించింది. అతని క్రమశిక్షణ, దృఢ సంకల్పం, తనకు ఇష్టమైన వాళ్లని కాపాడుకోవడానికి ప్రయత్నించే ఒక తండ్రి ఉన్నాడు. అతను అహంకారం కన్నా, తన ముందు తరాలను తీర్చిదిద్దిన వారసత్వాన్ని కోల్పోతానేమోనన్న భయంతోనే ఎక్కువగా నడుస్తాడు. ఆ భావోద్వేగ సంక్లిష్టత, అలాగే సంగీతం ప్రజలను ఎలా స్వస్థపరుస్తుందో, విభజిస్తుందో, చివరికి ఏకం చేస్తుందో అన్వేషించే అవకాశం నన్ను ఈ పాత్ర వైపు లాగింది. సూర్య ప్రతాప్, అసాధారణమైన తారాగణం, ప్రైమ్ వీడియోతో కలిసి పనిచేయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. మేము ఈ కథలోని ఆత్మతో ఎంతగానో మమేకమయ్యామో, ప్రేక్షకులు కూడా అంతే మమేకమవుతారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నటి మధుబాల మాట్లాడుతూ .. ‘‘జగమే సంగీతం’ కథలోని నిజాయితీ నన్ను బాగా కనెక్ట్ చేసింది. ప్రతి కుటుంబంలోనూ ప్రేమ, అపార్థాలు, త్యాగాలు ఉంటాయి. వాటిని తరచుగా బయటకు చెప్పుకోలేం. ఈ సిరీస్ ఆ భావోద్వేగాలను అద్భుతమైన సున్నితత్వంతో చిత్రీకరించింది. సంగీతం కథకు ప్రాణం పోసినప్పటికీ, చివరికి మన మనసులో నిలిచిపోయేవి అందులోని మనుషులు, వారి సంబంధాలే. ప్రకాష్ రాజ్‌తో, అద్భుతమైన తారాగణంతో కలిసి పనిచేయడం, సంస్కృతి,మానవ భావోద్వేగాలను రెండింటినీ చాటిచెప్పే కథలో భాగం కావడం నిజంగా సంతృప్తినిచ్చింది. ఈ కథకు మూలమైన భావోద్వేగ బంధాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ప్రైమ్ వీడియోలో చూసి ఆస్వాధించాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
Trailer link : https://youtu.be/tbiXRFXVuMs?si=tVpa2VV98BEQlC5j

