Skip to content

‘మై లవ్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

హైదరాబాద్: జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో రూపొందుతున్న ‘మై లవ్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఆగస్టు 22న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ ప్రసాద్ ఆడిటోరియంలో ఘనంగా విడుదల చేశారు. అదే వేదికపై జోష్ ఎంఆర్ఎస్ హైదరాబాద్ అవార్డ్స్–2026 కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
ఈ సందర్బంగా మై లవ్ హీరో సంజోష్ తగరం మాట్లాడుతూ, మీ ఫాస్ట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ ఎదో ఒక అమ్మాయిని ప్రేమించే ఉంటారు. మళ్ళీ ఆ అమ్మాయిని గుర్తుకు తెచ్చే సినిమా “మై లవ్ ‘ ఇదొక ఫీల్ గుడ్ సినిమా లవ్ ఎంటర్టన్మెంట్ డివోషనల్ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని కొత్త పాయింట్ తో ఈ సినిమా చేస్తున్నాం
ఈ సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఉన్నారు, నాకు సహకరించిన మీ అందరికి ధన్యవాదములు తెలిపారు,
ముఖ్య అతిధిగా వచ్చిన పుష్ప ఫేమ్ కేశవ గారు
మాట్లాడుతూ, ఈ సినిమాలో నేను ఒక మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నాను, కథ చాలా బాగుంది కథ ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పాయింట్ ని డైరెక్టర్ గారు తీసుకున్నారు,నాకు చెప్పగానే ఎం ఆలోచించకుండా ఓకే చేశాను, ఇందులో హీరోగా చేస్తున్న సంజోష్ గారి నుండి ఈ సంస్థ నుండి నేను గతంలో అవార్డ్స్ తీసుకున్నాను, ఎంతో మందికి అవార్డ్స్ ఇచ్చి వాళ్ళ అందరిని గుర్తిస్తున్నారు,ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న సంజోష్ గారికి కృతజ్ఞతలు, ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ చాలా బాగుంది ఈ సినిమా తప్పకుండ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఫస్ట్ లుక్, టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందో అని స్పష్టంగా అర్ధం అవుతుంది,ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు, మరో ముఖ్య అతిధి ఇటికాల పూరషోత్తం గారు హైయెర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పుడే చూసాను చాలా చాలా బాగుంది, హిట్ కంఫర్మ్, విజువల్స్ చాలా బాగున్నాయి ముక్యంగా హీరోగా పరిచయం అవుతున్న సంజోష్ గారి లుక్ స్క్రీన్ ప్రెసెంట్స్ చాలా బాగున్నాయి, ఫ్యూచర్ లో పెద్ద హీరో అవుతాడు, కొత్త కాన్సెప్ట్ తో మంచి సినిమా చేస్తున్న సంజోష్ గారికి ఇవ్వే నా బెస్ట్ విషెస్ అన్నారు, ఈ సినిమాలో హీరో సంజోష్ తగరం, హీరోయిన్ రిషిత, పుష్ప కేశవ, రచ్చ రవి, 30 ఇయర్స్ పృథ్వి, డీజే టిల్లు ఫేమ్ మురళీధర్ గౌడ్, తనికెళ్ళ భరణి మరి కొంతమంది ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు,

జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ శ్రీ సంజోష్ తగరం సినీ, వినోద రంగాలకు చెందిన ప్రముఖులు, కళాకారులు, మీడియా ప్రతినిధులు కార్యక్రమానికి హాజరై వేడుకను విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా ‘మై లవ్’ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు సినీ రంగంలో సృజనాత్మకతకు వేదిక కల్పించడమే లక్ష్యంగా జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

వేదిక: ప్రసాద్ ఆడిటోరియం, బంజారాహిల్స్, హైదరాబాద్
తేదీ: 22 ఆగస్టు 2026
సమయం: సాయంత్రం 6:00 గంటలకు
నిర్వాహకులు: జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్
వ్యవస్థాపకులు & చైర్మన్: శ్రీ సంజోష్ తగరం
https://www.transfernow.net/dl/20260823WBGQraTR

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.