ఆగస్టు 31న ‘డాయ్‌రా’ ట్రైలర్ విడుదల
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘డాయ్‌రా’ చిత్ర బృందం న్యూ అప్డేట్ ఇచ్చింది. కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో కాంబినేషన్లో ఒక పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌తో సినిమా ఎలా ఉండబోతోందనే హింట్‌ను టీం ఇచ్చింది. ఆగస్టు 31న ట్రైలర్ విడుదల కానున్న తరుణంలో ఈ పోస్టర్, అందులోని హింట్స్ అన్నీ కూడా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసేలా ఉన్నాయి. కథ పట్ల ఆసక్తిని రేకెత్తించేలా కొన్ని అంశాలను రివీల్ చేస్తూనే ఆ పాత్రల మధ్య ఉన్న సంబంధం గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తేలా పోస్టర్ ఉంది. పోలీసుల హెచ్చరిక టేప్ (police tape) మధ్య, ఒకరికొకరు వ్యతిరేకదిశలో నిలబడి ఉన్న కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్…
