టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, కన్నడ స్టార్ హీరో యష్ తల్లి మధ్య ప్రస్తుతం…
‘అనుమాన పక్షి’ నుంచి అతిగా ఆలోచించకురా సాంగ్ రిలీజ్
‘డిజె టిల్లు’ చిత్రంతో సెన్సేషనల్ డెబ్యూ చేసిన దర్శకుడు విమల్ కృష్ణ, రాగ్ మయూర్ కథానాయకుడిగా నటిస్తున్న మరో యునిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనుమాన పక్షి’తో అలరించబోతున్నారు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే టీజర్, విభిన్నమైన ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని పెంచింది.
తాజాగా ‘అతిగా ఆలోచించకురా’ అనే ఫన్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమా హీరో క్యారెక్టర్‌ను ఫన్‌గా ప్రజెంట్ చేస్తోంది. క్యారెక్టర్ స్వభావాన్ని, అతని ఆలోచనా విధానాన్ని సరదాగా చూపిస్తూ పాట సాగుతుంది. పాట విడుదలైన వెంటనే మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఈ పాటకు శ్రీచరణ్ పాకాల ఆకట్టుకునే ట్యూన్ సమకూర్చారు. సాన్వి, రవి ప్రకాష్ చోడిమళ్ల కలిసి ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు.
‘డీజే టిల్లు’తో తనదైన క్యారెక్టరైజేషన్, హ్యూమర్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విమల్ కృష్ణ ‘అనుమాన పక్షి’తో మరో వైవిధ్యమైన కాన్సెప్ట్‌ను తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో మెరిన్ ఫిలిప్ కథానాయికగా నటిస్తుండగా, ప్రిన్స్ సెసిల్, రాశి, అనన్య, చరిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ నామా, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా, అభినవ్ కునపరెడ్డి ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
‘అనుమాన పక్షి’ సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానుంది.
తారాగణం: రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సిసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, రాసి, అజయ్, మస్త్ అలీ
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: విమల్ కృష్ణ
నిర్మాతలు: రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్
సహ నిర్మాత: భరత్ లక్ష్మీపతి
ప్రొడక్షన్ హౌస్: చిలక ప్రొడక్షన్స్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రావణ్ కుప్పిలి
డిఓపి: సునీల్ కుమార్ నామా
ఆర్ట్ డైరెక్టర్: JK మూర్తి
ఎడిటర్: అభినవ్ కునపరెడ్డి
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్



