నిర్మాత కృష్ణన్న నిర్మించిన ‘తెల్ల కాగితం’ మూవీ అక్టోబర్ 2న విడుదలై పెద్ద విజయం సాధించాలి…
“ఆత్మకథ” చిత్ర ఆడియో లాంచ్
“ఆత్మకథ” ఆడియో లాంచ్ కార్యక్రమంలో “హనుమాన్ మ్యూజిక్” లేబుల్ లాంచ్
చిన్న సినిమాలకు అండగా “హనుమాన్ మ్యూజిక్” ఆడియో లేబుల్ ఉంటుంది : హనుమాన్ మ్యూజిక్ ఎండి అవినాష్ కూనపరెడ్డి
వారాహి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సోమేష్ నిర్మాతగా శ్రీనివాస్ బండ్రెడ్డి రచనా దర్శకత్వంలో రానున్న చిత్రం ఆత్మ కథ – యాన్ అన్ టోల్డ్ స్టోరీ. జెమిని సురేష్ హీరోగా రూప హీరోయిన్ గా చేయగా సమ్మెట గాంధీ, షకలక శంకర్, తాగుబోతు రమేష్, ధనరాజ్, నాగ మహేష్, బలగం విజయలక్ష్మి, శ్రీనివాస్ నాయుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రేయాంశ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి గోపి డిఓపిగా చేయగా రాఘవేంద్ర రెడ్డి ఎడిటింగ్ చేశారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు, రిథమ్ స్టూడియో ఇన్చార్జి కొల్లి రామకృష్ణ గారు, అలాగే కూనపరెడ్డి అవినాష్ గారి చేతుల మీదగా హనుమాన్ మ్యూజిక్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మ్యూజిక్ లేబుల్ లో మొదటిగా ఆత్మకథ చిత్ర పాటలు ఉండేలా ఆత్మకథ ఆడియోను ప్రముఖ సంగీత దర్శకులు RP పట్నాయక్, రఘు కుంచె చేతుల మీదగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎక్స్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. నా మిత్రుడు కోనపురెడ్డి అవినాష్ ప్రారంభించిన హనుమాన్ మ్యూజిక్ మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాస్ గారి దర్శకత్వంలో ఆత్మకథ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అవినాష్ మాకు బాగా కావలసిన వ్యక్తి. ఆయనకు ఈ లేబుల్ ద్వారా మంచి పేరు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్” అన్నారు.
సంగీత దర్శకుడు RP పట్నాయక్ మాట్లాడుతూ… “నేను ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం సురేష్. ఈ సినిమా కథ నాకు దర్శకులు చెప్పినప్పుడు నాకు చాలా సర్ప్రైజ్ గా అనిపించింది. ఈ సినిమాకి హీరో సమ్మెట గాంధీ గారు. ఆయన పాత్ర చాలా బావుంటుంది. శ్రేయాస్ కు ఆల్ ది బెస్ట్. హనుమాన్ మ్యూజిక్ ద్వారా చిన్న నిర్మాతలకు అండగా వచ్చారు. మీకు మేము అన్ని విధాలుగా సహకరిస్తాము” అన్నారు.
సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ… “ముందుగా సంగీత దర్శకుడు శ్రేయస్ కు ఆల్ ద బెస్ట్. హనుమాన్ మ్యూజిక్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సురేష్ నటిస్తున్న ఆత్మ కథ చిత్ర సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది, నిర్మాతను కాపాడుకోవాలి. శ్రీనివాస్ గారికి ఈ సినిమాతో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.
రిథమ్ స్టూడియో ఇన్చార్జి కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ… “శ్రీనివాస్ గారి కథ, దర్శకత్వం చాలా బావుంటాయి. ఈ సినిమా నేను చూసాను, చాలా బాగా చేశారు. సంగీతం అందించిన శ్రేయాస్ రీరికార్డింగ్ కూడా బాగా చేశారు. హనుమాన్ మ్యూజిక్ వారికి మంచి విజయం రావాలని, సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు రక్షిత్ మాట్లాడుతూ… “శ్రీనివాస్ గారు నాకు బాగా తెలుసు. అవినాష్ గారు చిన్న సినిమాల కోసం హనుమాన్ మ్యూజిక్ స్థాపించడం గొప్ప విషయం. సినిమాలకు ఇది మంచి ప్రోత్సాహం. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.
నటుడు నాగ మహేష్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. సంగీతం సముద్రం లాంటిది. శ్రేయాస్ చాలా సున్నా వయసులోనే అటువంటి సంగీతంలో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఆత్మకథ సినిమాలో నేను మంచి పాత్ర పోషించాను. సినిమా చాలా బావుంటుంది. సినిమాకు మంచి విజయం వస్తుందని నా నమ్మకం. హనుమాన్ మ్యూజిక్ ద్వారా అవినాష్ గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. సురేష్ గారికి ఈ సినిమా పెద్ద హిట్ గా నిలవాలని కోరుకున్నాను” అన్నారు.
నటుడు సమ్మెట గాంధీ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ముందుగా సురేష్ గారికి, అలాగే దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా కథలో నా పాత్ర విన్నప్పుడు సినిమాలో నా పాత్ర ఎంతో ముఖ్యం అని అర్థం అయింది. నాకు రాజన్న, వకీల్ సాబ్, రెక్కీ తర్వాత అంత గొప్ప పాత్ర ఆత్మకథ సినిమాలో ఉంటుంది. శ్రేయాస్ కూడా మంచి భవిష్యత్ ఉంది. నిర్మాతకు ఈ సినిమాతో కనకవర్షం కురవాలని కోరుకుంటున్నాను” అన్నారు.
సంగీత దర్శకుడు వారాహి శ్రేయాస్ మాట్లాడుతూ… “మా సినిమాను హనుమాన్ మ్యూజిక్ లో యాడ్ చేసినందుకు థాంక్స్. దర్శకులు నాతో బాగా పని చేసేలా చేశారు. మా గురువు గారికి, మీడియా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. శ్రేయాస్ నిర్మాతకు కొడుకు అని కాదు, అతను ఏం చేయగలడో కూడా చూసాను. ఈ సినిమాకు సంగీతం అందించేందుకు చాలా కష్టపడ్డాడు. అతనికి నా దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున థాంక్స్” అన్నారు.
హనుమాన్ మ్యూజిక్ ఎండి అవినాష్ కూనపరెడ్డి మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరుపేరున నా ధన్యవాదాలు. హనుమాన్ మ్యూజిక్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. రఘుపతి గారి మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఈ కంపెనీ ప్రారంభించడం జరిగింది. హనుమాన్ మ్యూజిక్ ద్వారా అన్ని సినిమాలను ప్రోత్సహించబోతున్నాము. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని, శ్రీనివాస్ గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్ రూప మాట్లాడుతూ… “మా సినిమా ఒక చిన్న కథ. నాకు మొదటిసారి అవకాశం ఇచ్చిన నడుచకుడు శ్రీనివాస్ గారికి థాంక్స్. ఈ సినిమాను అందరూ ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను. నాతో కలిసి నటించిన తోటి నటీనటులకు, నిర్మాతకు థాంక్స్. శ్రేయాస్ కు ఆల్ ది బెస్ట్” అన్నారు.
హీరో జెమిని సురేష్ మాట్లాడుతూ… “సినిమాలకు ఆడియో లాంచ్ కార్యక్రమాలు జరిగి చాలా రోజులు అయింది. ఇప్పుడు హనుమ మ్యూజిక్ ద్వారా నేను నటించిన ఆత్మకథ సినిమాతో మరోసారి ప్రారంభం కావడం చాలా సంతోషం అనిపించింది. దీనికి కారణమైన అవినాష్ గారికి థాంక్స్. RP పట్నాయక్ గారు, రఘు కుంచె గారు ఈ కార్యక్రమానికి హాజరుకావడం సంతోషంగా ఉంది. శ్రేయాస్ ఈ సినిమాకు మంచి సంగీతం ఇచ్చాడు. నిర్మాత సోమేష్ గారు ఈ సినిమా చేసినందుకు థాంక్స్. దర్శకుడు శ్రీనివాస్ గారు నాకు హీరోగా అవకాశం ఇచ్చినందుకు థాంక్స్, అది నా కల, నా కలను ఆయన నెరవేర్చారు. ఈ సినిమా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈ కథకు సమ్మెట గాంధీ గారు కీలక పాత్ర పోషించారు. సినిమాలో నటించి, సినిమా కోసం పని చేసిన అందరికీ చాలా థాంక్స్. భవిష్యత్తులో ఆడియో వేడుకలు జరగేలా చిన్న సినిమాలకు అండగా హనుమాన్ మ్యూజిక్ ఉండబోతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, అలాగే మీడియా వారికి ప్రత్యేకంగా థాంక్స్” అన్నారు.
నటీనటులు : జెమిని సురేష్, రూప, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, సమ్మెట గాంధీ, షకలక శంకర్, తాగుబోతు రమేష్, ధనరాజ్, నాగ మహేష్, బలగం విజయలక్ష్మి, శ్రీనివాస్ నాయుడు తదితరులు.
సాంకేతిక నిపుణులు :
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం : శ్రీనివాస్ గుండ్రెడ్డి
బ్యానర్ : వారాహి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాత : అర్థం వారాహి సోమేష్
సంగీత దర్శకుడు : శ్రేయాంశ్
ఎడిటర్ : రాఘవేంద్ర రెడ్డి
డిఓపి : గోపి
లిరిసిస్ట్ : ఉమా వంగూరి (యుఎస్ఎ)
విఎఫ్ఎక్స్ : చరణ్ గుండ్రెడ్డి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : బాబా శంకర్
పబ్లిసిటీ డిజైనర్ : దాడి త్రినాథ్
యాక్షన్ : దేవరాజ్ మాస్టర్
కొరియోగ్రఫీ : రెక్కీ మాస్టర్
పిఆర్వో : మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం




