ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ తో సబ్ స్క్రైబర్స్ ను ఎంగేజ్ చేస్తోన్న ఆహా ఓటీటీ ఇప్పుడు…
“సమ్మర్ హాలిడేస్” సినిమా నుంచి ‘ఫ్రెండ్ షిప్ సాంగ్’ రిలీజ్
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “సమ్మర్ హాలిడేస్” అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. “సమ్మర్ హాలిడేస్” సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే “సమ్మర్ హాలిడేస్” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
“సమ్మర్ హాలిడేస్” సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ‘క్రష్ సాంగ్..’, ‘స్కూల్ సాంగ్’ మ్యూజిక్ లవర్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ రోజు ఈ సినిమా నుంచి ‘ఫ్రెండ్షిప్ సాంగ్..’ రిలీజ్ చేశారు. ఈ పాటను సింజిత్ యెర్రమల్లి బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. ఈ పాట పల్లవికి పూర్ణాచారి సాహిత్యం అందించగా, చరణం, హుక్ లైన్ కిట్టు విస్సాప్రగడ రాశారు. శ్రీ రామ చంద్ర ఆకట్టుకునేలా పాడారు. ‘ఫ్రెండ్షిప్ సాంగ్..’ ఎలా ఉందో చూస్తే ‘ఓ రెండు తోకచుక్కలు తొడిగాయి చిన్ని రెక్కలు, గోదారి దారిపొడవునా ఎగిరాయే, ఆ పాల బోసినవ్వులు, అల్లరి తారాజువ్వలు, ఊరంతా కొత్త సందడే చేశారే, యేటి గట్టులో, మావి చెట్టులో, నీటి తొట్టిలో వీరే, ఒక్క చోటులో కుదురుగుండరు, రోజంతా ఈ కోతిలే, కాగితాల పడవల్లా తేలుతూ దాటుతారు గోదారే…’ అంటూ సాగుతుందీ పాట. ఈ పాటలో మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి, సింగర్ శ్రీరామచంద్ర నటించడం విశేషం.
నటీనటులు – రోహన్ రాయ్, అరుణ్, ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్, తదితరులు
టెక్నికల్ టీమ్
——————–
డీవోపీ – సాయి ప్రకాశ్
మ్యూజిక్ డైరెక్టర్ – సింజిత్ యెర్రమల్లి
బ్యానర్ – ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ, డైరెక్టర్ – శ్రీకర్

