Skip to content

‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ బ్లాక్ బస్టర్ కావడం చాలా హ్యాపీ: వంశీ నందిపాటి

‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: హర్ష చెముడు

హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బాబు డెగాల దర్శకత్వంలో చావన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు. రాజ్ సుహాస్, ప్రమదేశ్వి వి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. అక్టోబర్ 9 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ETV Winలో స్ట్రీమింగ్ అయిన ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అద్భుతమైన రెస్పాన్స్ తో అదరగొడుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

సక్సెస్ మీట్ లో హర్ష చెముడు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. వంశీ గారు ఒక ఈవెంట్‌కి వచ్చారంటే అదొక వ్యాలిడేషన్. ఆయన ఉన్నారంటే ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ అయినట్లే. సాయికృష్ణ గారు ఈ ప్రాజెక్ట్‌కు చాలా సపోర్ట్ చేశారు మా ప్రొడ్యూసర్ సపోర్ట్ కూడా చాలా ఉంది. ముఖ్యంగా చవన్ గారు ఈ ప్రాజెక్ట్‌ను ఒక డైరెక్టర్‌లాగా, ఒక ఆడియన్‌లాగా, ఒక ప్రొడ్యూసర్‌లాగా అన్ని కోణాల్లో చూశారు. ఈ ప్రాజెక్ట్‌కు ఏమేం కావాలో అవన్నీ చేశారు. ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా వచ్చింది. ఆదికి థ్యాంక్యూ. తను చాలా ఇన్‌పుట్స్ ఇచ్చాడు. అలాగే జీవన్ అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇదంతా ఒక మంచి టీమ్‌వర్క్ వల్లే జరిగింది. బాబు విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. తను తనకంటూ ఒక పేరు క్రియేట్ చేసుకున్నాడు. ఇది చాలా హ్యాపీ జర్నీ. చాలామంది జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూశారు. బాబు కోరుకున్నట్లే తనకి ఒక బైక్ ఇస్తాను (నవ్వుతూ). దీనికి సీజన్ 2 కూడా ఉంటుంది. టీమ్ మెంబర్స్ అందరూ ఈ ప్రాజెక్ట్‌ను ఓన్ చేసుకున్నారు. రీల్స్‌లో మా కంటెంట్ వైరల్ అవుతోంది. ఈ సిరీస్ చూసి చాలా మంది కాల్ చేశారు. చాలామంది ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. నాలో వారిని చూసుకున్నానని చెప్పారు. ఇది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, ఆలోచింపజేస్తుంది. అలాగే వాల్యూస్ గురించి, ఇన్‌సెక్యూరిటీస్ గురించి చాలా బ్యూటిఫుల్‌గా చెప్పారు. ఇంత మంచి ఆదరణ ఇచ్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.

వంశీ నందిపాటి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సక్సెస్ ఈవెంట్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. చవన్, ETV విన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మోస్ట్ ఎలిజిబుల్ కంటెంట్‌గా మారడం చాలా హ్యాపీగా ఉంది. ETV విన్ తెలుగులో నంబర్ వన్ ఓటీటీ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ కంటెంట్ మాట్లాడుతుంది, ఆ కంటెంట్ గురించి జనాలు మాట్లాడుతున్నారు. నాలుగు రోజుల్లో 100 మిలియన్ మినిట్స్ రీచ్ కావడం, అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో పెట్టిన రెండు రోజుల్లోనే నంబర్ వన్ పొజిషన్‌లోకి రావడం చాలా గొప్ప విషయం. అది ఇంకా కంటిన్యూ అవుతోంది.ఇది సూపర్ హిట్ మాత్రమే కాదు, పెద్ద బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్. చాలామంది చూసి చాలా బాగుందని కాల్ చేశారు. హర్ష గారు ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో నిల్చుంటే చాలు, ఆటోమేటిక్‌గా నవ్వొస్తుంది. ఒక నటుడికి అంతకుమించి ఏం కావాలి? ఈ సిరీస్‌లో నటించిన అందరికీ కంగ్రాచ్యులేషన్స్. అందరూ ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. ఈ దసరాకి ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ను ఓటీటీలో చూసి మీరందరూ ఆశీర్వదించాలి. ప్రొడ్యూసర్ చవాన్ నాకు ఎప్పటినుంచో పరిచయం. తనకి జీవితంలో ఏదైనా చేయాలనే ప్యాషన్ ఉంది. నాలుగు నెలల్లో ఈ కంటెంట్‌ను రెడీ చేసి రిలీజ్ చేయగలిగాడు. అది మామూలు విషయం కాదు. ఇది తన నిబద్ధతకు నిదర్శనం. తన విషయంలో చాలా గర్వంగా ఉంది. ETV Win ఇండియాలోనే నంబర్ వన్ ఓటీటీ అవ్వాలని కోరుకుంటున్నాను.

జీవన్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇంత పెద్ద సక్సెస్ సాధించడం చాలా హ్యాపీగా ఉంది. టీమ్ అందరికీ థ్యాంక్యూ. ఈ సిరీస్‌లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన బాబుకు థ్యాంక్యూ. అలాగే సాయికృష్ణ గారికి, అందరికీ థ్యాంక్యూ. ఈ క్యారెక్టర్‌కు నేను బాగుంటానని వాళ్లు నాపై నమ్మకం పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరు తప్పకుండా సిరీస్ చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు.

ETV Win వైస్ ప్రెసిడెంట్ సాయికృష్ణ మాట్లాడుతూ.. తెలుగులో ఉండే బెస్ట్ వెబ్ సిరీస్‌లన్నీ ETV Winలోనే ఉన్నాయి. అందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము చేసే కంటెంట్ అంతా చాలా రిలేటబుల్‌గా ఉంటుంది. దీనికి కారణం మా రైటర్స్, డైరెక్టర్స్‌తో పాటు మా ETV Win టీమ్. ETV Win సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే డిసప్పాయింట్ అవ్వరు. అది మా హామీ. ఈ వేడుకకు వచ్చి మాకు బెస్ట్ విషెస్ అందించిన వంశీ గారికి ధన్యవాదాలు.

ETV Win కంటెంట్ హెడ్ భరన్ మాట్లాడుతూ.. ముందుగా వంశీ గారికి థ్యాంక్యూ. మాకు బెస్ట్ విషెస్ అందించడానికి వచ్చారు. బాబు ఈ సిరీస్‌ను చాలా అందంగా రాశాడు. అలాగే చవన్ గారు అంతే అందంగా నిర్మించారు. ఈ సిరీస్ అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఈ సిరీస్ మొత్తంలో ఒక్క నెగెటివ్ క్యారెక్టర్ కూడా లేదు. ఈ సిరీస్‌ను ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్యూ.

డైరెక్టర్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సిరీస్‌కు మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మీమర్స్, అన్ని హ్యాండిల్స్‌లో ఈ సిరీస్ వైరల్ అవుతోంది. నిజంగా బాగుందని చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. ఇంత మంచి ఆదరణ ఇచ్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ సక్సెస్ మా టీమ్ అందరిదీ. ప్రేక్షకులు ఇలాగే ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు తీస్తానని కోరుకుంటున్నాను.

ప్రొడ్యూసర్ చావన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అందరూ కంటెంట్ నచ్చి ఈ సిరీస్ గురించి పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ETV Win యాజమాన్యానికి, సాయికృష్ణ గారికి ధన్యవాదాలు. అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. హైపర్ ఆది గారు ఈ ప్రాజెక్ట్‌కు చాలా హెల్ప్ చేశారు. ఆయన సజెషన్స్ వల్ల ఇంకా ఇంప్రూవ్ అయింది. బాబు ఈ సిరీస్‌తో చాలా మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తన విషయంలో చాలా హ్యాపీగా ఉంది. ఈ వేడుకకు వచ్చిన వంశీ అన్నకి థ్యాంక్యూ. ఆయనతో నాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. ఆయన నాకు ఎప్పుడూ స్ఫూర్తిగా ఉంటారు. ఈ వేడుకలో యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.