Skip to content

‘గోదారి గట్టుపైన’ సినిమా నుంచి నేను నా పల్లెటూరు సాంగ్ రిలీజ్

‘గోదారి గట్టుపైన’ సినిమా నుంచి నేను నా పల్లెటూరు సాంగ్ రిలీజ్ Telugu News

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ రోజు మేకర్స్ ‘గోదారి గట్టుపైన’ నుంచి ‘నేను నా పల్లెటూరు’ పాటను విడుదల చేశారు. పాట వినగానే అందమైన పల్లె జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. నాగ వంశీ కృష్ణ స్వరపరిచిన ఈ మెలోడీ పల్లెటూరి మట్టి వాసన, గోదావరి తీరాల అందంని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.

రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు పల్లెటూరి ఆత్మని హత్తుకునేలా చూపిస్తున్నాయి. ఎంఎల్‌ఆర్ కార్తికేయ వోకల్స్ ఈ పాటకు మరింత ప్రాణం పోసింది.

ఈ సాంగ్‌లో సుమంత్ ప్రభాస్ తన ఫ్రెండ్స్‌తో గడిపే సరదా క్షణాలని, పల్లెటూరి సింపుల్ లైఫ్‌ను ఎంతో సహజంగా చూపించారు. ఆ సన్నివేశాలు అందరికీ కనెక్ట్ అవుతున్నాయి. ఈ పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ఇన్‌స్టంట్ హిట్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రాని సినిమాటోగ్రఫీని సాయి సంతోష్, ప్రొడక్షన్ డిజైన్‌ను ప్రవాల్య, ఎడిటింగ్‌ను అనిల్ కుమార్ పి, సౌండ్ డిజైన్‌ను నాగార్జున తల్లపల్లి నిర్వహిస్తున్నారు.

ఈ చిత్రం మే 8న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

తారాగణం: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – సుభాష్ చంద్ర
బ్యానర్ – రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్
నిర్మాత – అభినవ్ రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మధులిక సంచన లంక
DOP – సాయి సంతోష్
సంగీతం – నాగ వంశీ కృష్ణ
ఎడిటర్ – అనిల్ కుమార్ పి
సౌండ్ డిజైనర్ – నాగార్జున తాళ్లపల్లి
ప్రొడక్షన్ డిజైనర్ – ప్రవల్య డి
PRO – వంశీ-శేఖర్
మార్కెటింగ్ – ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.