Skip to content

#గోపీచంద్ 34 ఘనంగా ప్రారంభం

#గోపీచంద్ 34 ఘనంగా ప్రారంభం Telugu News

హీరో టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక చిత్రం #గోపీచంద్34 ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బలమైన కథాంశాలతో కూడిన చిత్రాలను అందించడంలో పేరుపొందిన ’70mm ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై, విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ నటి అనార్కలి నజర్‌ను ఎంపిక చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా ఆమె తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నారు.

ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. గ్రాండ్ గా జరిగిన ముహూర్త కార్యక్రమంలో దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత KL దామోదర్ ప్రసాద్, ‘మైత్రి మూవీ మేకర్స్’ రవి శంకర్ స్క్రిప్ట్‌ను అందజేశారు. యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఫస్ట్ క్లాప్ కొట్టారు. నిర్మాత దిల్ రాజు ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

’70mm ఎంటర్‌టైన్‌మెంట్స్’ వంటి బలమైన నిర్మాణ సంస్థ #Gopichand34 చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఒక సరికొత్త కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనుంది. దర్శకుడిగా తన తొలి చిత్రంతో వి వెంకట్ ఒక బలమైన స్క్రిప్ట్‌ను రూపొందించారు. గోపీచంద్‌ను పూర్తి యాక్షన్ అవతార్‌లో, ఇంటెన్స్ డ్రామా, ఎమోషన్స్ కూడిన పాత్రలో ప్రజెంట్ చేయనున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. షామ్‌దత్ ISC సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, సామ్ CS సంగీతం సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. రామకృష్ణ-మోనిక ప్రొడక్షన్ డిజైనర్స్.

నటీనటులు: T. గోపీచంద్, అనార్కలి నజర్

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: వి వెంకట్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
బ్యానర్: 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్
DOP: షామ్‌దత్ ISC
సంగీతం: సామ్ CS
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ-మోనిక
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.