Skip to content

క్లైమేట్ కథలకు కొత్త వేదిక

క్లైమేట్ కథలకు కొత్త వేదిక Telugu News

నెట్‌ఫ్లిక్స్ సపోర్ట్‌తో ప్లక్ సంస్థ ఒక ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. Climate Scriptwriting Lab పేరుతో ఒక ప్రొడక్షన్‌ను స్టార్ట్ చేశారు. వాతావరణ మార్పు (Climate Change) వంటి అంశాలను ప్రేక్షకులకు చేరువ చేసే శక్తివంతమైన కథలను రూపొందించడమే దీని ఉద్దేశం. సినిమా, వెబ్ సిరీస్ వంటి విజువల్ మీడియా ద్వారా ప్రజలలో అవగాహన పెంచడంలో కథల పాత్ర ఎంత ముఖ్యమో తెలుసుకొని, ఈ ల్యాబ్ రూపొందించబడింది. తెలుగు స్ర్కిప్ట్‌లను కూడా తీసుకుని స్టోరీ డెవలప్ చేసి పెద్ద డైరెక్టర్‌‌తోనూ సినిమాలు, సిరీస్‌లు రూపొందించనున్నారు. అన్ని భాషల్లోనూ దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఈ ల్యాబ్‌కు అన్ని భాషలకు చెందిన స్క్రీన్‌రైటర్లు అప్లై చే సుకోవచ్చు. ఎంపికైన 60 మంది రచయితలకు ప్రముఖ స్క్రీన్‌రైటర్ల నుండి గైడెన్స్ కూడా లభిస్తుంది. ఇది కేవలం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు . భవిష్యత్‌లో పర్యావరణంపై ఆధారిత కథల కొత్త దిశను సృష్టించే ఒక ప్లాట్‌ఫామ్ అని నిర్వాహకులు తెలియజేశారు.
అప్లికేషన్లు ప్రస్తుతం ఓపెన్‌లో ఉన్నాయి. ఆసక్తి ఉన్న రచయితలు 2026 మే 9 లోపు అప్లై చేయాలి. Applications are now open: climatescriptwriting.com అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.