Skip to content

#NBK111 నుంచి కాజల్ అగర్వాల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్

#NBK111 నుంచి కాజల్ అగర్వాల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ యాక్షన్ చిత్రం #NBK111 కోసం మరోసారి జతకట్టారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం, యాక్షన్, ఎమోషన్స్, అద్భుతమైన సన్నివేశాల కలయికతో ప్రేక్షకులను అలరించనుంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ‘ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా’ పేరుతో ఒక పవర్ ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది, ఇది సినిమాలోని ఇంటెన్స్ వరల్డ్, బాలయ్య పవర్ ఫుల్ ప్రజెన్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

గ్లింప్స్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత, #NBK111 చిత్ర బృందం ఇప్పుడు కీలక పాత్రలో కనిపించనున్న కాజల్ అగర్వాల్‌ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు . ఆమె పుట్టినరోజు సందర్భంగా, ఇంపాక్ట్ ఫుల్ పాత్రను సూచించే ‘ఫస్ట్ లుక్’ పోస్టర్‌ను రివిల్ చేశారు. ఈ పోస్టర్‌లో కాజల్ అగర్వాల్ ఎంతో హుందాగా కనిపిస్తున్నారు.

చెక్స్ చీరలో, కళ్లజోడుతో కనిపించిన ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ కార్యాలయ వాతావరణంలో ఫైళ్లు, అధికారిక పత్రాల మధ్య కూర్చున్న కాజల్ పాత్ర కథలో కీలక ప్రాధాన్యతని చూపిస్తోంది. ఆమె చూపుల్లో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం పాత్ర ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయి. బాలకృష్ణ గ్లింప్స్‌లో 1993 బాంబే నేపథ్యంలో కనిపించిన ఉత్కంఠ, హింసాత్మక ప్రపంచానికి భిన్నంగా, కాజల్ పాత్రలో కనిపించిన స్థిరత్వం, నిబద్ధత కథలో ప్రత్యేక ముద్ర వేయబోతున్నాయి.

ప్రస్తుతం #NBK111 చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. ఈ చిత్రంలో మనోజ్ మంచు ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.

ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సంగీత సంచలనం ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తుండగా, రామ్-లక్ష్మణ్, రవి వర్మ, వి. వెంకట్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, మనోజ్ మంచు, కాజల్ అగర్వాల్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
బ్యానర్: వృద్ధి సినిమాస్
సంగీతం: ఎస్ థమన్
DOP: అరవింద్ S కశ్యప్ ISC
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, రవివర్మ, వివెంకట్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ & ట్రెండ్స్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.