హనుమాన్ 3D మీ అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను. మళ్లీ థియేటర్లలో 3Dలో చూడటానికి ఎంతో…
తిరుపతిలో “చెన్నై లవ్ స్టోరీ” సినిమా మ్యూజికల్ ఫెస్ట్, థర్డ్ సింగిల్ ‘జిగితార..’ విడుదల
“క”, “కె ర్యాంప్” తర్వాత వస్తున్న “చెన్నై లవ్ స్టోరీ” సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తుంది – హీరో కిరణ్ అబ్బవరం
“చెన్నై లవ్ స్టోరీ” తో మరో “బేబి” లాంటి సినిమాను ప్రేక్షకులకు అందించబోతున్నాం – స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్
“చెన్నై లవ్ స్టోరీ” సినిమా మరిపిస్తుంది, మురిపిస్తుంది, మీ అందరినీ మైమరపిస్తుంది – ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్
“చెన్నై లవ్ స్టోరీ” చూసి బయటకు వచ్చాక ఒక్క కిరణ్ గారే గుర్తుంటారు – ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని
తిరుపతిలో భారీ జన సందోహం మధ్య గ్రాండ్ గా హీరో కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ మ్యూజికల్ ఫెస్ట్ జరిగింది. ఈ ఈవెంట్ లో మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘జిగితార..’ రిలీజ్ చేశారు. ‘మెలొడీ బ్రహ్మ’ మణిశర్మ సాంగ్స్ కార్యక్రమానికి వచ్చిన వారిని ఉర్రూతలూగించాయి. ఈ ఈవెంట్ లో ప్రదర్శించిన ‘జిగితార..’ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ గ్రాండ్ మ్యూజికల్ ఫెస్ట్ లో
లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ – అల్లసాని పెద్దన శైలి జిగి బిగి అని ప్రసిద్ధి. ఆ పదమే జిగితార పాట రాసేందుకు స్ఫూర్తిగా నిలిచింది. ఒకప్పుడు గీతాంజలి, అభినందన వంటి గొప్ప ప్రేమ కథలు వచ్చాయి. ఆ సినిమాలకు మేము పాటలు రాసే అవకాశం దక్కలేదు అని బాధపడుతుంటాం. కానీ వచ్చే తరం గీత రచయితలు బేబి, చెన్నై లవ్ స్టోరీ వంటి గొప్ప ప్రేమ కథలకు పాటలు రాయలేకపోయాం అని బాధపడతారు. అలాంటి గొప్ప ప్రేమ కథల్ని మనకు అందిస్తున్న ఎస్ కేఎన్, సాయి రాజేష్ గార్లకు కృతజ్ఞతలు. ప్రేమను తప్ప ప్రేయసి నుంచి ఏ నిజమైన ప్రేమికుడూ మరేదీ ఆశించడు. కానీ ఈ చిత్రంలో హీరో హీరోయిన్ నుంచి కనీసం ఆ ప్రేమను కూడా ఆశించనంత నిస్వార్థంగా ప్రేమిస్తాడు. మణిశర్మ గారు మరోసారి తన పూర్వ వైభవం ప్రదర్శించే చిత్రమిది. ఈ జిగితార పాట సంగీత ప్రియుల మనసులో పగలూ రాత్రీ వెలుగుతూనే ఉంటుంది. అన్నారు.
డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ – జిగితార పాట సినిమా ప్రారంభమైన 30 నిమిషాలకు వస్తుంది. ఈ పాట మా అందరికీ చాలా స్పెషల్. ఈ పాటను కంపోజ్ చేసే టైమ్ లో మణిగారితో, అలాగే పాట రాసేప్పుడు అనంత శ్రీరామ్ గారితో ఆ మూవ్ మెంట్స్ ఎంజాయ్ చేశాం. షూటింగ్ టైమ్ లో స్ట్రెస్ గా ఉంటే కిరణ్ అన్న ఈ పాట ప్లే చేయమని అడిగేవారు. ఈ పాటకు ముందు వచ్చే సీన్ లో కిరణ్ గారు అద్భుతంగా పర్ ఫార్మెన్స్ చేశారు. 20 రోజుల షూటింగ్ తర్వాత నివి పాత్రలో గౌరిని తప్ప మరొకరిని ఊహించుకోలేకపోయాను. స్టీవెన్, నివి ఈ సినిమాలో కొన్ని నిమిషాల సేపు మాట్లాడుకునే సీన్స్ ఉంటాయి. ఆ సంభాషణను ప్రేక్షకులు కనీసం ఐదేళ్ల పాటు మర్చిపోలేరు. చెన్నై లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకోబోతున్నాం. త్వరలోనే మా ప్రొడ్యూసర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. అన్నారు.
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ – నా కెరీర్ లో ఒక సినిమా ఫంక్షన్ తిరుపతిలో జరుపుకోవడం ఇదే తొలిసారి. తిరుపతి ప్రజలు సినిమాను ఎంత సెలబ్రేట్ చేస్తారో కిరణ్ గారు ఇందాకే చెప్పారు. చెన్నై లవ్ స్టోరీ మూవీ నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమానే నన్ను ఎంచుకుంది అనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చేసి ఇంటికొచ్చాక ఒక సంతృప్తితో నిద్రపోయాను. సినిమా కోసం ఎంతైనా కష్టపడొచ్చు అనిపించేంత సంతృప్తిని ఈ మూవీ కలిగించింది. ఒక మంచి సినిమా చేస్తున్నామనే భావన అందరిలో కలిగింది. ఈ టీమ్ అంతా నా ఫ్యామిలీ. వాళ్లకు థ్యాంక్స్ చెప్పను. ప్రేక్షకులు మా సినిమాను మర్చిపోరు. వదిలిపెట్టరు. ఈ సినిమా మా అందరి కెరీర్ లో ఒక జిగితారగా మిగిలిపోతుంది. అన్నారు.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునేవారికి కిరణ్ గారు ఒక ఇన్సిపిరేషన్. ఈ సినిమాతో ఒక పర్ ఫార్మర్ గా, ఒక స్టార్ గా ఆయన మీద మన లవ్ రెట్టింపు అవుతుంది. చెన్నై లవ్ స్టోరీ చూసి బయటకు వచ్చాకు కిరణ్ గారు ఒక్కరే గుర్తుంటారు. శ్రీ గౌరి ప్రియ ఒక్క సినిమాతో తమిళం నేర్చుకున్న టాలెంటెడ్ హీరోయిన్. ఆమె ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంటుంది. బేబి లాంటి సినిమాను రూపొందించగల ఒకే ఒక్క తోపు డైరెక్టర్ మా సాయి రాజేష్ గారు. ఆయన స్నేహితుడు కావడం నా అదృష్టం. ఇంతమంచి మూవీలో నేనూ భాగమైనందుకు ఆనందంగా ఉంది. స్నేహానికి ఎంతో విలువ ఇచ్చే వ్యక్తి ఎస్ కేఎన్. హీరోలు ఎవరైనా మనకు కామన్ గా నచ్చేది మణిశర్మ గారి మ్యూజిక్. ఈ సినిమాకు ఆయన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. చెన్నై లవ్ స్టోరీ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అందుకుంటుంది. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మాట్లాడుతూ – నేను చెన్నైలోనే మ్యూజిక్ నేర్చుకున్నాను. అక్కడే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను, స్టూడియో కట్టుకున్నాను. చెన్నై గాలిలోనే ఒక మ్యూజిక్ ఉంటుంది. అది నేను అనుభవించాను. అక్కడ ఉన్న మరో అద్భుతం మా గురువు గారు ఇళయరాజా గారు. చెన్నై లాంటి ఒక మంచి బ్రీజీ సాంగ్స్ ను డైరెక్టర్ రవి, ప్రొడ్యూసర్ సాయి రాజేష్, ఎస్ కేఎన్ దగ్గరుండి నాతో తీసుకున్నారు. కిరణ్, గౌరి మంచి పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. జిగితార పాటను తిరుపతిలో మీ అందరి ముందు రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా బాగుండాలని ఆ ఏడుకొండల వాడిని వేడుకుంటున్నా. అన్నారు.
చిత్ర కథా రచయిత, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ మాట్లాడుతూ – తిరుపతి నాకు సెకండ్ హోమ్ లాంటిది. నెల్లూరులో చదువుకున్నా, చదువు మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. ఎప్పుడూ సినిమాలపైనే ధ్యాస ఉండేది. తిరుపతిలో ఉండే ఫ్రెండ్స్ ను కలిసేందుకు రెగ్యులర్ గా ఇక్కడికి వస్తుండేవాడిని. వాక్ మెన్ లో పాటలు, బీజీఎంలు వింటూ ఇక్కడ రోడ్లపై తిరుగుతూ కథల గురించి ఆలోచిస్తుండేవాడిని. అలా పాటలు వింటూ ఎన్నోసార్లు తిరుపతి కొండ ఎక్కాను. ఈ తిరుపతి ఎంత అందంగా ఉంటుందో మా చెన్నై లవ్ స్టోరీ సినిమా అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. కలర్ ఫొటో తప్ప మిగతా నా అన్ని సినిమాల ఈవెంట్స్ తిరుపతిలో చేశాము. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా రిలీజ్ ముందే ఇక్కడ సాంగ్ లాంఛ్ ఈవెంట్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ ఈవెంట్ అనుకున్నప్పుడు ఎంతమంది వస్తారు అనే భయం ఉండేది. కానీ మా అందరి ధైర్యం కిరణ్ గారు. ఆయన ఉన్నారు అనే ధైర్యంతో ఈవెంట్ చేశాం. మరో బేబి మీ దగ్గర నుంచి రాదు కదా అంటున్నారు కానీ చెన్నై లవ్ స్టోరీతో మరో బేబి లాంటి సినిమా వస్తోంది. మీరు సినిమా ముగుస్తుంది అనుకునే చోట ఇంటర్వెల్ వస్తుంది. సెకండాఫ్ మొత్తం సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. ఎక్కువ ఎమోషన్ తో మరింత ఇంటెన్స్ గా సినిమా ఉంటుంది. మీతో కన్నీళ్లు పెట్టించకుండా థియేటర్స్ నుంచి బయటకు పంపం. కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునే చిత్రమిది. మా హీరో పర్ ఫార్మెన్స్ చూసి గర్వంగా ఫీలవుతున్నా. ఆ పర్ ఫార్మెన్స్ తీసుకున్న డైరెక్టర్ రవికి థ్యాంక్స్ చెబుతున్నా. హీరోయిన్ చుట్టూ తిరిగే ప్రేమ కథ ఇది. ఇలాంటి కథకు గౌరి దొరకడం మా అదృష్టం. మీరంతా ఆమె చేసిన నివి పాత్రతో ప్రేమలో పడతారు. ఇందాక మణిశర్మ గారి AV చూస్తే మనసు నిండిపోయింది. మీరు ఇండస్ట్రీని ఏలడానికి మరోసారి వచ్చేయండి. హీరోలందరికీ మ్యూజిక్ చేయండి. అన్నారు.
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – మేమొక సినిమా తీసి, ఏడుకొండల వాడి సన్నిధిలో ఆ ప్రమోషన్ స్టార్ట్ చేయడం అనేది గౌరవంగా, గర్వంగా భావిస్తున్నాను. సినిమా కోసం చొక్కాలు చింపుకునేంత అభిమానం ఉన్న గడ్డ ఈ రాయలసీమ. ఇక్కడే ఈవెంట్ చేయాలని అనుకున్నాం. ఏ సినిమాకైనా ఫస్ట్ టాక్ మొదలయ్యేది రాయలసీమ నుంచే. మెగాభిమానిగా చిరంజీవిగారి ప్రతి సినిమా షోస్ గురించి టాక్ గురించి ఇక్కడి నుంచే తెలుసుకునేవాడిని. తెలుగు సినిమా తీసి చెన్నై లవ్ స్టోరీ అని టైటిల్ ఎందుకు పెట్టారని ఎవ్వరూ అడగరు, మనకు సినిమా అంటే అంత ప్రేమ. లాంగ్వేజ్, హీరో ఎవరు అనేది చూడం, కంటెంట్ నచ్చితే టెంట్ వేసుకుని చూస్తాం. అలాంటి అభిమానం చూపించే నిష్కలంకమైన ఆడియెన్స్ అందరికీ నమస్కారం. జూలై 13న ప్రీమియర్స్ తో బేబి సినిమా జర్నీ మొదలైంది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు కలెక్ట్ చేసింది, రెండు నేషనల్ అవార్డ్స్ సహా 34 అవార్డ్స్ గెల్చుకుంది. బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డ్ సాధించారు సాయి రాజేష్. బేబి తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే తపన పడ్డాం. ఆ టైమ్ లో సాయి రాజేష్ గారు చెప్పిన కథ ఇది. ఈ కథ చెబుతున్నప్పుడు నవ్వొచ్చింది. కన్నీళ్లు వచ్చాయి. చివరకు ఇదీ మనం చేయాల్సిన సినిమా అనిపించింది. ఆయన ఈ మూడేళ్లు చెన్నై లవ్ స్టోరీ కోసమే వర్క్ చేశారు. హిందీలో బేబి మూవీ చేస్తున్నారు. టాప్ డైరెక్టర్ గా ఉండి కూడా ఫెడరేషన్ కు వైస్ ప్రెసిడెంట్ గా సేవలందిస్తున్నారు. తీసుకోవడమే కాదు ఇవ్వడం తెలిసిన వ్యక్తి సాయి రాజేష్ గారు. వైవిధ్యమైన చిత్రాలు చేసే కిరణ్ అబ్బవరం అయితేనే ఈ కథకు బాగుంటుందని అనిపించింది. రైతు బిడ్డగా మొదలైన ఆయన ప్రస్థానం హీరోగా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా విజయవంతంగా సాగుతోంది. ఆయన ఈ రాయలసీమ గడ్డ నుంచి 50 మంది కొత్త వాళ్లను పరిచయం చేశారు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి కిరణ్ గారు. మీలాంటి యంగ్ స్టార్స్ టాలీవుడ్ కు వరం. ఈ కథ వినగానే ఎలాంటి డిస్కషన్స్ లేకుండా ఎప్పటినుంచి చేద్దామని కిరణ్ గారు అన్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ గారు మా మూవీ చేయడం మా అదృష్టం. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తున్నాం. ఆ క్రమంలో శ్రీ గౌరి ప్రియను ఈ సినిమా కోసం తీసుకున్నాం. ఆమె నివి పాత్రలో మీ అందరికీ గుర్తుండిపోతారు. ఎన్నేళ్లు సినిమా చేశామనేది కాదు ఎన్నేళ్లు సినిమా గుర్తుపెట్టుకుంటారు అనేది ముఖ్యం. 10, 15 సినిమాలు తీసిన అనుభవజ్ఞుడిలా ఈ చిత్రాన్ని రూపొందించాడు రవి నంబూరి. ఔట్ పుట్ తో చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని అవార్డ్ ఫంక్షన్స్ జరిగినా అన్ని నామినేషన్స్ లో లామినేషన్ లా ఉంటారు కిరణ్ అబ్బవరం. ఈ చిత్రంలో కిరణ్ గారి పర్ ఫార్మెన్స్ నభూతో నభవిష్యత్ అనిపించింది. అది లవ్ స్టోరీని మించిన సినిమా. ఆ మించి అనేది ఏముందో ఇంటర్వెల్ తర్వాత నుంచి తెలుస్తుంది. ఇంద్ర, తొలిప్రేమ లాంటి గొప్ప చిత్రాలు రిలీజైన జూలై 24న మా చెన్నై లవ్ స్టోరీ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – సినిమా రిలీజ్ కు వస్తుందంటే ప్రొడ్యూసర్స్ బిజినెస్ గురించి ఆలోచిస్తుంటారు. కానీ మా ప్రొడ్యూసర్స్ మాత్రం సినిమాను ఎంత బాగా ప్రమోట్ చేయాలి, ఎక్కడెక్కడ ఈవెంట్స్ చేయాలి అని సినిమా గురించే ఆలోచిస్తుంటారు. ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. షూటింగ్ డేస్ పెరిగినా కేవలం క్వాలిటీ కోసమే ఆలోచించారు. మా డైరెక్టర్ రవిని వెన్నంటి ఉన్నారు. ఇలాంటి ప్రొడ్యూసర్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ రవి రైటింగ్ కు ఎమోషనల్ గా ఫీలయ్యాను. ఆయన నా లైఫ్ దగ్గర నుంచి రాశాడా అనేంత బాగా సీన్స్ రాశారు. జూలై 24న సినిమా ప్రారంభమైన 30వ నిమిషం జిగితార సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ కు ముందు లీడ్ మీకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చెన్నై లవ్ స్టోరీ సినిమాలోని కాన్వర్జేషన్స్ చాలా ఏళ్లు మీకు గుర్తుండిపోతాయి. ఈ తిరుపతిలోనే మణిశర్మ గారి ఎన్నో సినిమాలు చూసి ఎంజాయ్ చేశాను. ఖుషి సినిమాలో పవన్, భూమిక సీన్స్ కు మీరు ఇచ్చిన బీజీఎం వింటుంటే థియేటర్స్ లో మాకు ఆ వైబ్ తెలిసేది. చెన్నై లవ్ స్టోరీకి మణిగారు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇచ్చారు అనేది థియేటర్ లో చూసేందుకు నేను వెయిట్ చేస్తున్నా. సాయి రాజేష్ గారు కథ చెప్పినప్పుడు హార్ట్ టచింగ్ గా అనిపించింది. ఈ సినిమాలో స్టీవెన్ రోల్ చేయడం హ్యాపీగా ఫీలవుతున్నాను. ఎస్ కేఎన్ గారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయనతో సినిమా గురించి మాట్లాడుతుంటే ఒక ఎనర్జీ, ఎగ్జైట్ మెంట్ వస్తుంది. గౌరితో కలిసి నటిస్తుంటే నిజంగా రియల్ లైఫ్ లో ఇద్దరి మధ్య ఏదైనా జరిగితే ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకున్న ఫీల్ కలిగింది. ఈ సినిమా తర్వాత ఆమెకు చాలా మంచి పేరు వస్తుంది. సెకండాఫ్ లో పదినిమిషాల సీక్వెన్స్ అయితే ఆమె అద్భుతంగా నటించింది. నా అభిమాని అని చెప్పుకునేందుకు గర్వపడేలా కష్టపడి సినిమాలు చేస్తాను. “క” సినిమాను సూపర్ హిట్ చేశారు, ” కె ర్యాంప్” బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. తిరుపతి సన్నిధిలో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చెబుతున్నా “చెన్నై లవ్ స్టోరీ” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. తిరుపతిలోనే మన సినిమా మొదట షోస్ పడతాయి. మీ టాక్ కోసం మేమంతా వేచి చూస్తుంటాం. అన్నారు.
“చెన్నై లవ్ స్టోరీ” సినిమాలో శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ నటిస్తోంది. “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేష్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ కథను అందించగా రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్ – దేవి పర్చూరి
ఆర్ట్ – భాస్కర్ ముదావత్
ఎడిటర్ – సంతోష్ నాయుడు
డీవోపీ – విశ్వాస్ డేనియల్
లిరిక్స్ – అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా), వంశీ కాకా
మార్కెటింగ్ – హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ – సాయి రాజేష్
నిర్మాతలు – ఎస్ కేఎన్, సాయి రాజేష్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – రవి నంబూరి

