Skip to content

‘మహాకాళి – ది ఎండ్ బిగిన్స్’ ఆగస్టు 24న బిగ్ అప్‌డేట్

‘హనుమాన్’ సంచలన విజయం తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘మహాకాళి’. ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘మహాకాళి – ది ఎండ్ బిగిన్స్’కు సంబంధించిన కీలక అప్‌డేట్ ఆగస్టు 24న రానున్నట్లు ప్రకటించారు.

ఆ రోజు ఏ అప్‌డేట్ ఇవ్వబోతున్నారనే విషయాన్ని మాత్రం మేకర్స్ సస్పెన్స్‌లో ఉంచారు. దీంతో అసలు ఆ రోజు ఏం రివీల్ చేయబోతున్నారనే ఆసక్తి మూవీ లవర్స్‌లో మరింత పెరిగింది.

పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌కే దుగ్గల్ సమర్పిస్తున్నారు. రిజ్వాన్ దుగ్గల్ నిర్మిస్తుండగా, ప్రశాంత్ వర్మ షోరన్నర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. RKD Studios బ్యానర్‌పై సినిమా తెరకెక్కుతోంది.

ఇప్పటికే ‘మహాకాళి’లో భూమి శెట్టి మహాకాళిగా, అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా కనిపించే ఫస్ట్ లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ‘హనుమాన్’తో మొదలైన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లనుంది.

‘హనుమాన్’ క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌తో ‘మహాకాళి’పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఆగస్టు 24న రాబోయే అప్‌డేట్ సినిమా ప్రపంచాన్ని మరింతగా పరిచయం చేయడంతో పాటు, త్వరలో ప్రారంభం కానున్న ప్రమోషన్స్‌కు మంచి బజ్ క్రియేట్ చేయనుంది.

ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.

తారాగణం: భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, రోహిత్ సరాఫ్

సాంకేతిక సిబ్బంది:
షోరన్నర్: ప్రశాంత్ వర్మ
బ్యానర్: RKD స్టూడియోస్
నిర్మాత: రిజ్వాన్ రమేష్ దుగ్గల్
దర్శకత్వం: పూజ అపర్ణ కొల్లూరు
సంగీతం: స్మరణ్ సాయి
DoP: సురేష్ రగతు
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
Ex-Producer: వెంకట్ కుమార్ జెట్టి
కాస్ట్యూమ్ డిజైనర్: శిల్పా GNS
పబ్లిసిటీ: అనంత్ కంచెర్ల
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.