‘మహాకాళి – ది ఎండ్ బిగిన్స్’ ఆగస్టు 24న బిగ్ అప్‌డేట్
‘హనుమాన్’ సంచలన విజయం తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘మహాకాళి’. ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘మహాకాళి – ది ఎండ్ బిగిన్స్’కు సంబంధించిన కీలక అప్‌డేట్ ఆగస్టు 24న రానున్నట్లు ప్రకటించారు. ఆ రోజు ఏ అప్‌డేట్ ఇవ్వబోతున్నారనే విషయాన్ని మాత్రం మేకర్స్ సస్పెన్స్‌లో ఉంచారు. దీంతో అసలు ఆ రోజు ఏం రివీల్ చేయబోతున్నారనే ఆసక్తి మూవీ లవర్స్‌లో మరింత పెరిగింది. పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌కే దుగ్గల్ సమర్పిస్తున్నారు. రిజ్వాన్ దుగ్గల్ నిర్మిస్తుండగా, ప్రశాంత్ వర్మ షోరన్నర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు…
