Skip to content

ది ప్యారడైజ్ నుంచి ‘ఆయా షేర్’ సాంగ్ రిలీజ్

ది ప్యారడైజ్ నుంచి ‘ఆయా షేర్’ సాంగ్ రిలీజ్ Telugu News

కల్ట్ హిట్‌ దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, విజనరీ మేకర్ శ్రీకాంత్ ఓదెల బిగ్ కాన్వాస్‌పై బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్‌ ది ప్యారడైజ్ కోసం రెండవసారి కలిశారు. SLV సినిమాస్ ఆధ్వర్యంలో సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి స్థాయిలో రూపొందిస్తున్నారు.

ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ ప్రోమో వైరల్ అయ్యింది, అంచనాలను భారీగా పెంచింది. ఇప్పుడు విడుదలైన ఫుల్ ట్రాక్ తో రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అంచనాలని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాడు. ట్రైబల్ పర్కషన్‌తో పాటు గ్రిటీ ఎలక్ట్రానిక్ సౌండ్స్‌ను కలిపి, ప్రైమల్ ఎనర్జీతో నిండిన థండరస్ మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ అందించాడు. సెలబ్రేషన్, అడ్రినలిన్ రెండింటి మేళవింపుగా ఈ పాట అదిరిపోయింది.

కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం “షేర్” రాకను సూచిస్తూ ఆకలి, ఆధిపత్యం, టెర్రిటోరియల్ పవర్‌తో నిండిన అంథమ్‌లా వినిపిస్తుంది. ప్రముఖ తెలంగాణ జానపద గాయకులు అడ్డుల జంగిరెడ్డి, అకునూరి దేవయ్య తమ శక్తివంతమైన వోకల్స్ తో పాటను మరింత ఎత్తుకు తీసుకెళ్లారు.

నాని ట్రాన్స్‌ఫర్మేషన్ ఈ పాటలో హైలెట్ గా నిలిచింది. జడలతో కూడిన హెయిర్ స్టైల్, గడ్డం, రెడ్ బ్లేజర్‌తో రగ్గడ్ లుక్‌లో ఆయన వారియర్, ఐకాన్‌లా కనిపిస్తున్నారు. నాయకుడిగా ఆయన స్వాగ్ అదిరిపోయింది.

సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు మరింత మ్యాడ్ ఎనర్జీని జోడించింది. నాని డాన్స్ అదిరిపోయింది. హుక్ స్టెప్ నుంచి ఫ్లోర్ మూవ్స్ వరకు అన్నీ వైరల్ అవుతున్నాయి. బిర్యానీ హాండీలతో వచ్చే ఎంట్రీ నుంచి చివర్లో సింహాసనంపై కూర్చునే ఎగ్జిట్ వరకు ప్రతి ఫ్రేమ్ లో ఆయన ప్రెజెన్స్‌ నెక్స్ట్ లెవల్ లో వుంది.

శ్రీకాంత్ ఒడెల ఇక్కడ సృష్టించిన విజువల్ యూనివర్స్ అద్భుతంగా, రఫ్‌గా కనిపిస్తున్నాయి. భారీ స్థాయి, ఇంటిమేట్ ఎమోషన్స్ రెండింటినీ కలిపిన ఈ వరల్డ్, ఈ జానర్‌లో ఇప్పటివరకుఎన్నడూ చూడడని అద్భుతంగా కనిపిస్తోంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ విల్యూస్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తున్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా చేసిన విజువల్ డీటైలింగ్ ప్రత్యేకంగా నిలిచింది.

అనిరుధ్ రవిచందర్ ఆల్బమ్‌ను వైరల్ బ్యాంగర్‌తో ప్రారంభించగా, మిగతా పాటలపై అంచనాలు ఇప్పుడు నెక్స్ట్ లెవల్ కి చేరాయి.

ఈ చిత్రంలో మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సిహెచ్ సాయి, ఎడిటింగ్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా

“ది ప్యారడైజ్ ” చిత్రం ఆగస్టు 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో పాన్ వరల్డ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

తారాగణం: నాని, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
DOP: సిహెచ్ సాయి
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.