Skip to content

‘పోలీస్ కంప్లైంట్’లో వరలక్ష్మి శరత్ కుమార్ – నవీన్ చంద్ర జంట‌పై ల‌వ్ సాంగ్

‘పోలీస్ కంప్లైంట్’లో వరలక్ష్మి శరత్ కుమార్ – నవీన్ చంద్ర జంట‌పై ల‌వ్ సాంగ్ Telugu News
‘పోలీస్ కంప్లైంట్’లో వరలక్ష్మి శరత్ కుమార్ – నవీన్ చంద్ర జంట‌పై ల‌వ్ సాంగ్ Telugu News
‘పోలీస్ కంప్లైంట్’లో వరలక్ష్మి శరత్ కుమార్ – నవీన్ చంద్ర జంట‌పై ల‌వ్ సాంగ్ Telugu News

▪️ బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ “ప్రేమ ఓ ప్రేమ”
▪️ లాంచ్ చేసిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప్ర‌భు
▪️ సంజీవ్ మేగోటి ద‌ర్శ‌క‌త్వంలో యాక్షన్ థ్రిల్లర్‌

సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై, బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ – నవీన్ చంద్ర జంట‌పై చిత్రీకరించిన బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ “ప్రేమ ఓ ప్రేమ” అనే పల్లవితో మొదలైన ప్రేమ గీతాన్ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప్ర‌భు లాంచ్ చేశారు. ఈ పాట‌ అన్విక ఆడియోస్ ద్వారా రిలీజ్ అయింది.
“ప్రేమ ఓ ప్రేమ” పాటకు సంగీతం సుధాకర్ మారియో సమకూర్చారు. ఈ పాట యూత్‌కు బాగా న‌చ్చుతుంద‌ని, ట్రెండింగ్‌గా నిలిచిపోతుంద‌ని, సూప‌ర్ హిట్ ల‌వ్ సాంగ్స్‌ల్లో ఈ పాట కూడా చోటు ద‌క్కించుకుంటుంద‌ని దర్శకుడు సంజీవ్ మేగోటి న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. హారర్ థ్రిల్లర్, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెర‌కెక్కించిన‌ట్టు తెలిపారు.
యాక్షన్, కామెడీ, రొమాన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన‌ ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు నటిస్తున్నారు. దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్–రవితేజ ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది పాత్రలు వారి గత చిత్రాలకు భిన్నంగా ఉంటాయని తెలిపారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు.
న‌టీన‌టులు: వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమిని సురేష్
మేకప్: విజయ్-శేఖర్
కాస్ట్యూమ్ డిజైన్: నల్లపు సతీష్
ప్రొడక్షన్ డిజైనర్: కొండపనేని మురళీధర్
ఆర్ట్ డైరెక్టర్: కె.వి. రమణ
ఎడిటర్: అనుగోజు రేణుకా బాబు
కొరియోగ్రఫీ:పైడి రాజు, సన్ రేస్, మెహర్ బాబా,
ఫైట్స్ :- డ్రాగన్ ప్రకాష్ – రవితేజ
సంగీతం:
ఆరోహణ సుధీంద్ర – సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియో
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: సంజీవ్ మేగోటి
సౌండ్, డిజైనింగ్ & ఆడియోగ్రఫీ:
దొంతం ప్రవీణ్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:- సతీష్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ :- బిజివేముల రాజశేఖర్ రెడ్డి
ప్రొడక్షన్ మేనేజర్లు:- రమేష్-కొల్లా గంగాధరం
సహ దర్శకులు :- ఎం. కృష్ణ – కె. వెంకట నారాయణ
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్లు:-
పేరం అయాన్ష్ రెడ్డి (అశోక్)
పవన్ కుమార్ గోడవర్తి
అసోసియేట్ డైరెక్టర్లు:- కృష్ణ మూర్తి – ఎన్. రామ్ కుమార్ – మద్దిల చెరువు దీపక్
సహాయ దర్శకులు :-
నవీన్ కపిల్ – కంచె వీరేష్- స్వాతి మంగాపురం-
కె. మహేశ్వర్- కందెల గణేష్- యశ్వంత్ కుమార్ – పీవీఎస్ నీరజ్
DOP:- S N. హరీష్
ఆపరేటివ్ కెమెరామెన్ :- సెంథిల్ కుమార్
సహాయకుడు :- హిమగిరి
VFX :- మ్యాజిక్ లూమ్ విజయ్
పీఆర్ఓ:- అశోక్ దయ్యాల

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.