🔸 చోళ చక్రవర్తి సుందర చోళుని కుమార్తె కుందవై పాత్ర ను ఉదహరిస్తూ నటి త్రిష…
మైరా ఎస్టేటిక్ క్లినిక్ ను ప్రారంభించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ !!!

కర్నూలు లో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సందడి చేశారు. కర్నూలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైరా ఎస్టేటిక్ సెంటర్ ను పాయల్ రాజ్ పుత్ ప్రారంభించారు. ఆదునాతనమైన ఏఐ బేస్డ్ ఇస్తాటెక్ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని రాజ్ పుత్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కర్నూలు కు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడి ప్రజలు తనకు ఘనస్వాగతం ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్బంగా ఎంఏసి చైర్ పర్సన్ అండ్ ఫౌండర్ శ్రీవల్లి కొర్రపాటి మాట్లాడుతూ… ‘’ఏ ఐ టెక్నాలజీ ద్వారా మైరా ఎస్తేటిక్ క్లినిక్ ను కర్నూల్ లో ప్రారంభించడం సంతోషంగా ఉంది, అందరికి అందుబాటు ధరల్లో మేము స్కిన్ మరియు హెయిర్ సమస్యలకు పరిస్కారం చూపిస్తామని, మా సర్వీసులను అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు.
