నాగశౌర్య, రామ్ దేశినా, శ్రీనివాస రావు చింతలపూడి, శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ వారి 'బ్యాడ్ బాయ్…
‘గాయపడ్డ సింహం’లో జేడీ చక్రవర్తి ధర్మ క్యారెక్టర్ హైలైట్

తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ నుంచి రెట్రో స్టైల్, & డార్క్ హ్యూమర్ తో బ్రూటల్ ధర్మగా జేడి చక్రవర్తి గ్లింప్స్ రిలీజ్
తరుణ్ భాస్కర్ మోడరన్ ఎంటర్టైనర్ గాయపడ్డ సింహం అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ను సృష్టిస్తోంది. కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ పతాకాలపై పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్.
మేకర్స్ ఇప్పుడు మరొక కీలక పాత్ర.. జేడి చక్రవర్తి బ్రూటల్ ధర్మగా పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అతని పేరుకు తగినట్లుగా గ్లింప్స్ చిల్లింగ్, స్టైలిష్ గా వుంది. నల్లటి కళ్లజోడు, బంగారు గొలుసుతో అతని లుక్ హుందాగా, ఆకట్టుకునే రెట్రో-గ్యాంగ్‌స్టర్ వైబ్‌ను కలిగిస్తోంది.
సత్య లాజిస్టిక్స్ అనే కంపెనీతో ముడిపడి ఉన్న అక్రమ రవాణా, డ్రగ్స్, ఆయుధాలకు సంబంధించిన ధర్మ కార్యకలాపాలను ఈ గ్లింప్స్ సూచిస్తుంది. ఒక అనుచరుడి సుధీర్గ డైలాగ్ ని ధర్మ మధ్యలోనే ఆపి, ‘ఆడి మోనో లాగ్ మొత్తం చెప్పే వరకూ వెయిట్ చేస్తారా.. ఎసేయండి’ అని ధర్మ చెప్పడం డార్క్ హ్యుమర్ తో క్యారెక్టర్ ఇంటన్సిటీని ప్రజెంట్ చేస్తోంది.
జేడీ చక్రవర్తి బ్రూటల్ మేకోవర్, ప్రజెన్స్, రెట్రో ఫ్లేర్ ‘బ్రూటల్ ధర్మ’ను ప్రత్యేకంగా నిలబెట్టాయి, ఇది సినిమా ప్రధాన హైలైట్లలో ఒకటిగా ఖచ్చితంగా ఉంటుంది.
ఈ చిత్రానికి విద్యా సాగర్ చింత ఛాయాగ్రహణాన్ని నిర్వహించగా, స్వీకర్ అగస్తి సంగీతాన్ని అందించారు, విప్లవ్ నిషాదం ఎడిటర్. చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైనర్,
‘గాయపడ సింహం’ మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
గ్లింప్స్ లాంచ్ ప్రెస్ మీట్ లో జేడి చక్రవర్తి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. యాక్టర్స్ అందరికీ కమల్ హాసన్ గారు ఒక కొలమానం. ఆయన చేసిన అన్ని క్యారెక్టర్లు వరల్డ్ సినిమా హిస్టరీలో ఎవ్వరూ చేయలేదు, చేయబోరు. అయితే “గాయపడ్డ సింహం”లో యాక్టర్‌గా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయనకు రాని అదృష్టం నాకు వచ్చిందని భావిస్తున్నాను. అలాంటి క్యారెక్టర్ ఇందులో చేశాను. “ధర్మ” క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. క్యారెక్టర్ పరంగా కమల్ హాసన్ గారు కూడా ఇలాంటి పాత్ర చేసి ఉండరు. అంత గొప్ప పాత్ర ఇందులో చేశాను. కెరీర్లో చాలామందికి జయాపజయాలు ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరికీ కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర ఒకటి ఉంటుంది. నాకు ‘మనీ’, సత్య, ‘అనగనగా ఒక రోజు’ చిత్రాలు ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయి. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అలాంటి క్యారెక్టర్ చేసే అవకాశం దొరికింది. ఈ సినిమాను పవన్ తన భుజాన వేసుకుని మొదలుపెట్టాడు. తర్వాత అందరూ ఒక టీమ్‌గా కలిసి పని చేశారు. ఈ సినిమా దిల్ రాజు గారికి నచ్చడం అనేది పెద్ద కమర్షియల్ కొలబద్ద. కశ్యప్ ఖచ్చితంగా చాలా ఇన్నోవేటివ్ డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమాలో చాలా కొత్త రకం కామెడీ ఉంటుంది. తరుణ్ భాస్కర్, నేను, భాను ఇలా చాలామంది డైరెక్టర్స్ కలిసి పనిచేసిన సినిమా ఇది. కశ్యప్ ఎంతో మంది డైరెక్టర్స్‌తో పనిచేస్తూ తనకు కావాల్సింది తీసుకున్నాడు. చాలా కొత్త రకం హ్యుమర్ వున్న సినిమా ఇది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.
పవన్ సాదినేని మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉంటాయని నేను ముందే చెప్పాను. అందులో ఒక పెద్ద సర్ప్రైజ్ జెడి గారు. ఆయన ఓకే చెప్పిన తర్వాత సినిమా స్థాయి ఇంకా పెరిగింది. సినిమాని మేము ఎంత ఎంజాయ్ చేశామో, మీరు కూడా థియేటర్లలో అంతే ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను.
డైరెక్టర్ కశ్యప్ మాట్లాడుతూ…“గాయపడ్డ సింహం” అంటే తరుణ్ భాస్కర్ ఒక్కరే కాదు, ఇంకా ఉన్నారని ముందే చెప్పాను — అది జెడి గారు. తరుణ్ భాస్కర్ తన బెస్ట్ ఇచ్చాడని చాలాసార్లు చెప్పాం. అలాగే జెడి గారి బెస్ట్ సినిమాల్లో మనకు నచ్చిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో కనిపిస్తాయి.
ప్రొడ్యూసర్ భాను కిరణ్ ప్రతాప్ మాట్లాడుతూ… జెడి గారికి థాంక్స్. ఆయన ఈ క్యారెక్టర్ చేయడం సినిమాకి చాలా అడ్వాంటేజ్ అయింది. ఆయన ఈ పాత్ర చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆయన “సత్య”గా ఎంత పాపులర్ అయ్యారో, “ధర్మ”గా కూడా అంతే పాపులర్ అవుతారని నమ్ముతున్నాను.
తారాగణం: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కాశ్యప్ శ్రీనివాస్
సమర్పణ: పవన్ సాదినేని
నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్
బ్యానర్లు: సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్, జీ స్టూడియోస్
DoP: విద్యా సాగర్ చింత
సంగీతం: స్వీకర్ అగస్తీ
ఎడిటర్: విప్లవ్ నిషాదం
ప్రొడక్షన్ డిజైనర్: చంద్రిక గొర్రెపాటి
కథ: సూర్య ప్రకాష్ జ్యోసుల
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీని జోస్యుల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పెన్మత్స అజయ్ వర్మ
PRO: వంశీ-శేఖర్
డిజిటల్ మీడియా: హ్యాష్‌ట్యాగ్ మీడియా
సౌండ్ డిజైన్: సింక్ సినిమాస్
Vfx & టైటిల్ యానిమేషన్: ఎగ్ వైట్
పబ్లిసిటీ డిజైన్: ఎల్లోటూత్స్
