Skip to content

ఆశా భోంస్లే గారి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్‌ కల్యాణ్‌

ఆశా  భోస్లే  గారి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్‌ కల్యాణ్‌ Telugu News

ప్రముఖ గాయని శ్రీమతి ఆశా భోంస్లే గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆశాజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సుదీర్ఘ కాలం హిందీతోపాటు మరాఠీ, తెలుగు, బెంగాలీ వంటి భాషల్లో సినీ గీతాలు ఆలపించిన మధుర గాయని ఆమె. పాశ్చాత్య సంగీత శైలి గీతాలను సైతం ఆలపించి ఒక తరం యువతను ఉర్రూతలూగించారు. దమ్ మారో దమ్, చురా లియా హై తుమ్నే, ఇన్ అంకో కి మస్తీ, రాధా కైసే న జలే… లాంటి గీతాలతో సినీ, సంగీతాభిమానులను అలరించారు. తెలుగులో ఆశాజీ పాడిన గీతాలు తక్కువే అయినా హిందీ గీతాలతో తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితమే. శ్రీమతి ఆశా భోస్లే గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.