గద్దర్ అవార్డ్స్ 2025లో నాగ చైతన్య ‘తండేల్’ రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న నాగ చైతన్య – జాతీయ సమగ్రత చిత్రంగా ‘తండేల్’ యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన బ్లాక్‌బస్టర్ మూవీ ‘తండేల్’ గద్దర్ అవార్డ్స్ 2025లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య చేసిన అద్భుతమైన నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించగా, అదే సమయంలో ఈ చిత్రం బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్ గా కూడా ఎంపికైంది. ఈ అరుదైన రెండు అవార్డులు నాగ చైతన్య నటనలోని బలాన్ని మాత్రమే కాకుండా, చిత్రానికి ఉన్న సామాజిక ప్రాధాన్యతను కూడా ప్రతిబింబిస్తుంది. విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటున్న నాగ చైతన్య ‘తండేల్’లో తన కెరీర్‌లోనే…
