Skip to content

‘కొరియన్ కనకరాజు’ విజువల్ ట్రీట్-‘రాసా గుమ్మడి’ సాంగ్ లో ఫుల్ మాస్ డ్యాన్స్ తో అదరగొట్టిన వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మునుపెన్నడూ లేని సరికొత్త అవతార్‌లో ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఎంటర్‌టైనింగ్ టీజర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన తొలి పాట ‘కంసహామ్నిదా’ సినిమాపై ప్రేక్షకుల్లో బజ్‌ను క్రియేట్ చేశాయి.

ఈ రోజు మేకర్స్ సినిమా నుంచి రెండో పాట ‘రాసా గుమ్మడి’ ని విడుదల చేశారు. తొలి పాటలో కనిపించిన కొరియన్ ఫ్లేవర్‌కు పూర్తి భిన్నంగా, ఈసారి స్వచ్ఛమైన తెలుగు జానపద శైలిలో ఈ పాట కట్టిపడేసింది. ఎస్. తమన్ స్వరపరిచిన ఈ పాటలో ఎనర్జిటిక్ బీట్స్, గ్రామీణ సంగీత వాయిద్యాలు, పండుగ వాతావరణాన్ని గుర్తు చేసే ఫోక్ వైబ్స్ కలగలిసి పూర్తి స్థాయి ఎంటర్‌టైనింగ్ మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తున్నాయి.

పాట ప్రారంభంలో హీరోని వన్నె రాయుడు అంటూ హీరోయిన్ ఆప్యాయంగా పలకరించడంతో మొదలై, ఆ తర్వాత ఫుల్ ఎనర్జీతో సాగే ఫోక్ సెలబ్రేషన్‌గా మారుతుంది. నల్గొండ గద్దర్ తన ప్రత్యేకమైన వాయిస్ తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లగా, కాసర్ల శ్యామ్ అందించిన క్యాచీ లిరిక్స్ గ్రామీణ జాతర వాతావరణాన్ని అద్భుతంగా చూపిస్తూ పాటను వెంటనే ఆకట్టుకునేలా చేస్తుంది.

ఈ పాటలో వరుణ్ తేజ్ సంప్రదాయ దుస్తులతో పాటు స్టైలిష్ షేడ్స్‌లో మాస్ లుక్‌తో మెరిశారు. ఆయన హై ఎనర్జీ డ్యాన్స్ మూమెంట్స్ పాటలోని సెలబ్రేషన్ మూడ్‌ను మరింత ఎలివేట్ చేశాయి. కార్నివాల్ థీమ్‌లో రూపొందించిన కలర్‌ఫుల్ విజువల్స్ ప్రతి ఫ్రేమ్‌కు గ్రాండియర్ తీసుకొచ్చాయి. దక్ష నగార్కర్ తన గ్లామర్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకోగా, వరుణ్ తేజ్‌తో ఆమె కెమిస్ట్రీ స్క్రీన్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పండుగ వాతావరణం, ఫోక్ బీట్స్, వీరిద్దరి కెమిస్ట్రీ కలిసి ‘రాసా గుమ్మడి’ ని బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులను అలరించే ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టనున్నాయి.

ఈ చిత్రంలో రితిక నాయక్ కథానాయికగా నటిస్తుండగా, సత్య ఎంటర్టైనింగ్ రోల్ లో కనిపించనున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ రెడ్డి కటసాని సినిమాటోగ్రఫీ అందించగా, సత్య జి ఎడిటింగ్

‘కొరియన్ కనకరాజు’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

తారాగణం: వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య

రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
బ్యానర్లు: యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రాఫర్: మనోజ్ రెడ్డి
ఎడిటర్: సత్య జి
ఆర్ట్ డైరెక్టర్: ఎ పన్నీర్ సెల్వం
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.