జూన్ 10న ‘ఆల్ఫా’ టీజర్
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’. ఆలియా భట్, శర్వారి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా టీజర్‌ను జూన్ 10న విడుదల చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే పెంచి, శిక్షణ ఇచ్చి ఒక ప్రాణాంతక హంతకురాలిగా (కిల్లింగ్ మెషిన్‌గా) తీర్చిదిద్దిన ఓ యువతి కథకు ఆరంభం ఎలా జరిగిందనే విషయాన్ని ప్రేక్షకులకు ఈ టీజర్ ద్వారా చూపించబోతున్నారు. YRF స్పై యూనివర్స్‌లో ఒక హంతకురాలు ప్రధాన పాత్రగా ఉండే తొలి ఆరిజిన్ స్టోరీ ఇది రూపొందుతుండటం విశేషం. సీనియర్ ట్రేడ్ సర్కిల్స్ దీనిపై స్పందిస్తూ.. “ఆల్ఫా” టీజర్ జూన్ 10న విడుదలవుతుంది. ఈ టీజర్ తర్వాత సినిమా కథనే ప్రధానంగా ఎలివేట్ చేస్తూ భారీ స్థాయిలో ప్రమోషన్…
