సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రష్మిక మందన్న.. రిసెప్షన్‌కి ఆహ్వానం..
జూబ్లీహిల్స్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులను కలిసి తమ వివాహ రిసెప్షన్ కు ఆహ్వానించిన సినీనటి రష్మిక మందన్న.ఈ నెల 4 న హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ- రష్మిక వివాహ రిసెప్షన్.
విరోష్ పెళ్లి రిసెప్షన్ పరిమిత ఆహ్వానితులకు మాత్రమే
- పోలీస్ ఆంక్షల నేపథ్యంలో మీ భద్రత ముఖ్యమని విజ్ఞప్తి చేసిన విరోష్ టీమ్ ఇండియా లోనే క్రేజీ వెడ్డింగ్ ఈవెంట్ గా విరోష్ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పెళ్లి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఈ నెల 4న సాయంత్రం విజయ్ దేవరకొండ, రశ్మిక వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో గెస్ట్ లు ఈ రిసెప్షన్ లో పాల్గొననున్నారు. దీంతో పోలీసులు విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇన్విటేషన్ లేని వారు ఈ రిసెప్షన్ కార్యక్రమానికి రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీస్ ల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా…
‘‘రాకాస’ థియేటర్‌కు వచ్చిన వాళ్లని నిరాశపర్చం.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల
ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకున్నారు. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో.. నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘పింక్ ఎలిఫెంట్ నుంచి వచ్చే ప్రతీ కంటెంట్‌ను ఆడియెన్స్ ప్రేమిస్తూ, సపోర్ట్ చేస్తూనే…
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్, డైరెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్
-సరస్వతి లాంటి కథ చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా ఇది: హీరో శరత్ కుమార్ వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ డైరెక్టర్, వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ…
పెద్ది’ డబ్బింగ్ ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది' సినిమా వేసవిలో గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో బజ్ నెక్స్ట్ లెవల్ కి చేసుకుంది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, బ్లాక్ బస్టర్ ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి కి ట్రెమండస్ రెస్పాన్స్ తో రికార్డులను బద్దలు కొట్టాయి. తాజాగా రామ్ చరణ్ 'పెద్ది' డబ్బింగ్ ప్రారంభించారు. పెద్ది పాత్రలో చరణ్ చెప్పిన 'ఏమది' డైలాగ్…
నవ్విస్తూ, భయపెడుతూ అంచనాలు పెంచేసిన ‘రాకాస’ టీజర్
ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని సాధించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్న నిహారిక ప్రస్తుతం మరో డిఫరెంట్ స్టోరీతో ఓ సినిమాని ఆడియెన్స్ ముందుకు తీసుకు రానున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో.. నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్ తరువాత సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. ఇక…
ఘనంగా సైన్స్ ఫెయిర్
మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకుని సైన్స్ ఫెయిర్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్ ఏజీఎం బి. కృష్ణ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల ప్రాజెక్టులను వైజ్ఞానిక ప్రదర్శనలో ఉంచారు. వాటిని బి. కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్ ఎన్. స్వాతి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాల డీన్ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్ పల్లవి, ప్రీ ప్రైమరీ ఇన్‌చార్జ్ పుష్ప, ఐపీఎల్ ఇన్‌చార్జ్ బాలరాజు, సి–బ్యాచ్ ఇన్‌చార్జ్ ఆంజనేయులు, కోఆర్డినేటర్స్ జైపాల్, జనార్ధన్, టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ ట్రైలర్
శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలలై ఈ సినిమా ఫస్ట్ సింగిల్, ఫస్ట్ సింగిల్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మెన్షన్ హౌస్ మల్లేష్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. మురళీధర్ గౌడ్ 'అదొక పెద్ద కథ' అని చెప్పడంతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మల్లేష్ క్యారెక్టరైజేషన్, పెళ్లి చూపులు, పెళ్లి తర్వాత జరిగిన సంఘటనలు.. అన్నీ మంచి వినోదాన్ని పంచాయి. డాక్టర్ బ్రాండ్ పేరు అడిగితే 'జై బాలయ్య' అని…
‘SYG’ 20 కోట్ల బడ్జెట్‌తో 35 రోజుల భారీ క్లైమాక్స్ షూటింగ్
మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్-ఇండియా స్పెక్టికల్ SYG (సంబరాల ఏటిగట్టు) తో ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నెక్స్ట్ లెవల్ లో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీం ప్రస్తుతం భారీ, హై-ఆక్టేన్ క్లైమాక్స్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. మేకర్స్ క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా 20 కోట్లకు పైగా కేటాయించారు. 35 రోజుల షెడ్యూల్ జరుగుతోంది, ఇందులో 18 భారీ యాక్షన్ బ్లాక్‌లు ఉన్నాయి, ప్రముఖ స్టంట్ డైరెక్టర్ కెవిన్ మాస్టర్…
