ఈ నెల 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ విజయ్…
“క్రేజీ కల్యాణం” ఒక హానెస్ట్ ఎంటర్ టైనర్, దసరా పండుగకు గన్ షాట్ హిట్ అవుతుంది – ‘నవరసరాయ’ డా. నరేష్ విజయ కృష్ణ
‘నవరసరాయ’ డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “క్రేజీ కల్యాణం”. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ నెల 16న “క్రేజీ కల్యాణం” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాస్, డైరెక్టర్ నందినీరెడ్డి ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాట్లాడుతూ – నేను “క్రేజీ కల్యాణం” సినిమా చూశాను చాలా ఎంటర్ టైన్ చేసింది. ఈ పండుగకు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తారు. నరేష్, తరుణ్ భాస్కర్ తమ పర్ ఫార్మెన్స్ తో ఇరగదీశారు. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులకు ఇంటర్వెల్ సీన్ బాగా గుర్తుండిపోతుంది. అనుపమ అద్భుతంగా నటించింది. కేరళ నుంచి వచ్చి తెలుగు నేర్చుకుని తెలంగాణ యాసలో మెప్పించిన హీరోయిన్స్ లో సాయి పల్లవి తర్వాత అనుపమ ఉంటారు. ప్రొడ్యూసర్ జగన్ మోహన్ ప్యాషన్ తో ఈ సినిమా నిర్మించారు. సురేష్ బొబ్బిలి తెలంగాణ నుంచి వచ్చిన టెక్నీషియన్స్ లో ఆణిముత్యం. ఈ సినిమా మంచి విజయం సాధించి టీమ్ అందరికీ పేరు తీసుకురావాలి. అన్నారు.
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ – ఈ ఈవెంట్ కోసం చెన్నై నుంచి వచ్చాను. ప్రొడ్యూసర్ జగన్ మోహన్ ఈ సినిమా చేస్తున్నప్పటి నుంచి ఈ మూవీ గురించి చెప్పాడు. మా బన్నీవాస్ చెప్పినట్లు ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ పండక్కి వస్తున్న పెద్ద సినిమాలతో పాటు ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలి. పెద్ద వాటితో పాటు చిన్న చిత్రాలు ఆదరణ పొందినప్పుడే ఇండస్ట్రీ కళకళలాడుతుంది. మొదటి సినిమా రిలీజ్ టైమ్ డైరెక్టర్ కు ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసు. బద్రప్ప ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూపించాడు. మంచి సినిమా చేశాడనే ఇంప్రెషన్ కలిగింది. అనుపమ తెలుగు నేర్చుకుని మా శతమానం భవతి సినిమాలోనే డబ్బింగ్ చెప్పుకుంది. ఆమె ఇప్పుడు తెలంగాణ యాసలో ఆకట్టుకునేలా నటించింది. రాజ్ వెడ్స్ రాంబాయి రిలీజ్ తర్వాత అఖిల్ రాజ్ ను పిలిచి మాట్లాడాను. అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. తరుణ్ భాస్కర్ నటుడిగా, దర్శకుడిగా ఆకట్టుకుంటున్నారు. నరేష్ గారు ఎవర్ గ్రీన్ యాక్టర్. ఆయన తన నటనతో ఏడిపించగలడు, నవ్వించగలడు. సురేష్ బొబ్బిలి మా బలగం సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాడు. మా దేత్తడి సినిమాను కూడా మ్యూజికల్ గా హిట్ చేయబోతున్నాడు. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
డైరెక్టర్ నందినీరెడ్డి మాట్లాడుతూ – ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ పండక్కి రెండు పెద్ద సినిమాలతో పాటు టపాకాయ్ లాంటి క్రేజీ కల్యాణం కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను మీరు ఎంతగా ఎంజాయ్ చేయబోతున్నారో ట్రైలర్ కు మీరు ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటేనే తెలుస్తోంది. తరుణ్ భాస్కర్ గురించి లాస్ట్ ఈవెంట్ లో నేను మాట్లాడలేదు. ఆయన ఏడాదికో సినిమా డైరెక్టర్ గా చేయాలనేది నా సలహా. మన తెలుగు వారికి సినిమా అంటే పిచ్చి. అందుకే కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వస్తుంటారు. జగన్ మోహన్ చాలా మంచి వ్యక్తి. సినిమాల ప్రొడక్షన్ వద్దు అని చెబుతూ ఉంటాను. కానీ ఆయన ప్యాషన్ తో మూవీస్ చేస్తున్నారు. ఈ సినిమా ఆయనకు పెద్ద సక్సెస్ ఇవ్వాలి. అలాగే ఈ చిత్రానికి నాలుగు ఫిల్లర్స్ లా నిలబడ్డారు నరేష్ గారు, అనుపమ, అఖిల్ రాజ్, తరుణ్ భాస్కర్. వీళ్లు ఇంత బాగా నటించారంటే డైరెక్టర్ బద్రప్ప విజన్ కనిపిస్తోంది. క్రేజీ కల్యాణం సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అఖిల్ సాయి మాట్లాడుతూ – మా సినిమాకు ప్రతి ఆర్టిస్ట్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా ప్రతి ఆడియెన్ కు రీచ్ కావాలని మంచి ప్రమోషన్ చేయిస్తున్నారు. మా చిత్రంతో ఆడియెన్స్ తో పాటు క్రిటిక్స్ ను పక్కా సంతృప్తి పరచబోతున్నాం. అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ – నేను వర్క్ చేసిన చిత్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ క్రేజీ కల్యాణం అవుతుందని చెప్పగలను. ఈ సినిమాకు ఈ దసరా సెలవుల్లో ప్రేక్షకులు కుటుంబాలతో కలిసి థియేటర్స్ కు వస్తారు. పెద్ద ఎత్తున ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మా టీమ్ అంతా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. ఈ సినిమాకు రిలీజ్ రోజు నుంచి థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తాయి. అన్నారు.
డైరెక్టర్ బద్రప్ప గాజుల మాట్లాడుతూ – మా మూవీ టీజర్ ను నందినీరెడ్డి గారు రిలీజ్ చేశారు. అప్పటి నుంచి పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయ్యింది. ట్రైలర్ చూపించేందుకు దిల్ రాజు గారి ఆఫీస్ కు వెళ్లాను. ఒక దేవాలయంలా అనిపించింది. ఎన్నో గొప్ప సినిమాలు ఆ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాయి. నేను కాలేజ్ చదివే రోజుల్లో మా క్లాస్ మేట్స్ అమ్మాయిలకు పెళ్లిల్లు చేసేవారు. వారి క్లాస్ మేట్స్ పెళ్లికి అతిథుల్లా వస్తే ఆ అమ్మాయి మాత్రం పెళ్లి కూతురిగా కనిపించేది. ఆ అమ్మాయిలకు కూడా తమ జీవితంలో ఏదో సాధించాలనే కోరికలు ఉంటాయి. కానీ అవన్నీ మనసులోనే ఉంచుకుని పెద్దల మాట మీద పెళ్లికి ఒప్పుకుంటారు. అలాంటి అమ్మాయి మనసులో కలిగే భావాలు ఏంటి అనే ఆలోచనే ఈ కథకు స్ఫూర్తి. మనం ఎన్ని కథలు రాసుకున్నా ప్రొడ్యూసర్ కు ఆ టేస్ట్ ఉండాలి. మా జగన్ మోహన్ అన్న నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. తన కూతురు పెళ్లి జరిపించినంత ఘనంగా ఈ సినిమా నిర్మించారు. మా మూవీ రిలీజ్ కు సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చిన బన్నీ వాస్ గారికి థ్యాంక్స్. ఈ చిత్రానికి హీరో నరేష్ గారు. తరుణ్ భాస్కర్ గారితో వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. అనుపమ హుషారు పిల్ల. ఈ క్యారెక్టర్ కు బాగా సరిపోయింది. తన క్యారెక్టర్ లో సూపర్బ్ గా పర్ ఫార్మ్ చేసింది. అఖిల్ రాజ్ రాజు వెడ్స్ రాంబాయి కంటే ముందే మా మూవీలో భాగమయ్యారు. సురేష్ బొబ్బిలి సంగీతం మా సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. అన్నారు.
ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ – మా డైరెక్టర్ బద్రప్ప ఒక సోదరుడిలా నాతో చాలా కాలంగా ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమాకు మంచి కథ, మంచి ఆర్టిస్టులు..ఇలా ప్రతీది ఒక అదృష్టంలా కుదిరింది. నరేష్ గారు, అనుపమ, తరుణ్ భాస్కర్, అఖిల్..ఇలా కథ ప్రతి ఒక్కరూ కథ విన్న వెంటనే సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. ఇంటికి తండ్రి ఎలా పెద్ద దిక్కుగా ఉంటారో మా సినిమాకు నరేష్ గారు అలా పెద్ద దిక్కుగా నిలబడ్డారు. నరేష్ గారు ఈ సినిమాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. అనుపమ ప్రాణం పెట్టి నటించారు. ఇందరు పేరున్న వాళ్లు మా మూవీలో నటించారంటే నేను ప్రొడ్యూసర్ గా లక్కీగా ఫీలవుతున్నా. సినిమా చూశాక మీరంతా నేను లక్కీ ప్రొడ్యూసర్ అనుకుంటారు. అఖిల్ రాజ్ ను విందు భోజనం సినిమాతో నేను హీరోగా లాంఛ్ చేశా. సినిమా కోసం చాలా కష్టపడేతత్వం ఉన్న హీరో అఖిల్ రాజ్. మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న దిల్ రాజు గారికి, బన్నీ వాస్ గారికి, నందినీరెడ్డి గారికి థ్యాంక్స్. అన్నారు.
హీరో అఖిల్ రాజ్ మాట్లాడుతూ – మా టీజర్ రిలీజ్ చేసిన తర్వాత ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ వచ్చిందో ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కు కూడా అలాంటి ఫీల్ కలుగుతోంది. మా మూవీ ట్రైలర్ కు మీరు ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఈ నెల 16న మా మూవీ థియేటర్స్ లో గట్టి సౌండ్ చేయబోతోంది. ప్రేక్షకులంతా మా సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తారు. మీరంతా తప్పకుండా మా మూవీ చూసేందుకు థియేటర్స్ కు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
యాక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ – ఈ సినిమాలో బాలరాజు అనే పాత్రలో నటించాను. ఈ పాత్రలో నటించేందుకు మీలో చాలా మంది స్ఫూర్తిగా నిలుస్తారు. ఈ సినిమాలో నేను నటించాను అనేకంటే నటించాల్సివచ్చింది అని చెప్పాలి. ఈ సినిమాలో నటించడం సంతోషాన్నిచ్చింది. బాలరాజు చాలా అమాయకుడు. అతనికి లెక్కలు రావు. 30, 60, 90 మాత్రమే తెలుసు. బావిలో కప్పలా ఉంటే ఇతరుల్ని చూసి గ్లాసులో ఐసులా కరిగిపోవాలనుకుంటాడు బాలరాజు. నా క్యారెక్టర్ ను మీరు థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ – క్రేజీ కల్యాణం సినిమాలో నటించడం చాలా హ్యాపీగా ఉంది. నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్ ఇది. ఈ కథ విన్న తర్వాత ఇలాంటి కథలో నేను భాగమవ్వాలని అనుకున్నాను. శతమానం భవతి తర్వాత అలాంటి సినిమా ఎప్పుడు చేస్తున్నారు అని అడిగేవారు. వారికి నా ఆన్సర్ ఈ సినిమా. ఆల్రెడీ మేము పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యాక్ట్రెస్ గా మంచి సంతృప్తిని మిగిల్చిన చిత్రమిది. ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ తో ఆకట్టుకునే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా క్రేజీ కల్యాణం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. నేను తెలంగాణ యాసలో బాగా మాట్లాడనంటే కారణం మా డైరెక్టర్ బద్రప్ప. సినిమా ఔట్ పుట్ చూశాక మాలో కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. స్క్రిప్ట్ చెప్పినదాని కంటే డైరెక్టర్ బద్రప్ప బాగా రూపొందించారు. మా మూవీ ట్రైలర్ మీకు నచ్చిందని నమ్ముతున్నా. సినిమాను కూడా ట్రైలర్ లాగే బాగా ఎంజాయ్ చేస్తారు. మా మూవీ ఈ నెల 16న రిలీజ్ కు వస్తోంది. తప్పకుండా మీ ఫ్యామిలీస్ తో కలిసి థియేటర్స్ కు వెళ్లండి. పండుగ ఉత్సాహాన్ని మా సినిమా రెట్టింపు చేయబోతోంది. అన్నారు.
‘నవరసరాయ’ డా.నరేష్ విజయ కృష్ణ మాట్లాడుతూ – క్రేజీ కల్యాణం సినిమా ఒక హానెస్ట్, ఆర్గానిక్ ఎంటర్ టైనర్. ఈ దసరా పండుగకు గన్ షాట్ లా హిట్ కాబోతోంది. మా సినిమాను ప్రీమియర్స్ నుంచే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. తెలంగాణతో పాటు ఏపీలోనూ ప్రేక్షకులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కినా యూనివర్సల్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. హిందీలో రీమేక్ చేసినా ఆదరణ పొందే కంటెంట్ ఈ సినిమాలో ఉంది. నేను 300 చిత్రాల్లో నటించినా ఇది నా బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఉన్న సినిమా అని చెప్పగలను. నేను వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్ లో జగన్ మోహన్ మోస్ట్ ప్యాషనేట్. డే 1 నుంచి మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు. అనుపమ తన నటనతో ఆకట్టుకుంటుంది. ఫన్, ఎమోషన్, లవ్, మ్యూజిక్ ఉన్న రోలర్ కోస్టర్ సినిమా ఇది. నేను, తరుణ్, అఖిల్, అనుపమ చేసిన క్యారెక్టర్స్ ను ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. బద్రప్ప టాలీవుడ్ కు మరో టాలెంటెడ్ రైటర్, డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. అన్నారు.
నటీనటులు – ‘నవరసరాయ’ డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి, తదితరులు
టెక్నికల్ టీమ్
——————————-
కాస్ట్యూమ్ డిజైనర్ – జె.గాయత్రి దేవి
ఆర్ట్ డైరెక్టర్ – సాయి కదిర
ప్రొడక్షన్ డిజైనర్ – శ్రీపాల్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అఖిల్ సాయి శ్రీమూర్తి
కొరియోగ్రాఫర్ – ఈశ్వర్ పెంటి
యాక్షన్ – డ్రాగన్ ప్రకాష్
లిరిక్స్ – గోరటి వెంకన్న, చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్
ఎడిటర్ – శ్రావణ్ కటికనేని
డీవోపీ – శ్యామ్ దూపాటి
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
స్క్రీన్ ప్లే – శ్రీనివాస రవీంద్ర (ఎంఎస్ఆర్)
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
ప్రొడ్యూసర్ – బూసం జగన్ మెహన్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్, డైరెక్షన్ – బద్రప్ప గాజుల

