Skip to content

“రణబాలి” సినిమా నుంచి ‘కోబలి..’ లిరికల్ సాంగ్ రిలీజ్

  • ఈ నెల 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు “రణబాలి” సినిమా నుంచి మేకర్స్ ‘కోబలి..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు అజయ్ – అతుల్ గూస్ బంప్స్ తెప్పించేలా ట్యూన్ కంపోజ్ చేయగా, కేశవాదిత్య పవర్ ఫుల్ లిరిక్స్ రాశారు. వి.ఎం. మహాలింగం మెస్మరైజ్ చేసేలా పాడారు. ‘కోబలి..’ సాంగ్ ఎలా ఉందో చూస్తే – ‘ రేగే ఉరుము దరువు మిన్ను ముట్టగా, అష్టదిక్కులే పిక్కటిల్లవా, రేగే ఉరుము దరువు నిన్ను ముట్టగా, అష్టదిక్కులే పిక్కటిల్లవా, జోగే రెయ్యిలోన పగల సెగలిలా పొగులుతుండగా పగలు పుట్టదా, మూగే సావునైన సంపడానికి సత్తువియ్యరా కాలకాలుడా, పెన్నేరల్లె తేరు ఉరకలెత్తగా సిందు తొక్కమా భద్రమల్లడా…’ అంటూ సాగుతుందీ పాట. ఈ పాటలో విజయ్ దేవరకొండ ఫెరోషియస్ గా కనిపించి ఆకట్టుకుంటున్నారు.

నటీనటులు – విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు

టెక్నికల్ టీమ్
—————–
బ్యానర్ – మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ – గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్
ప్రొడ్యూసర్స్ – నవీన్ యెర్నేని, రవిశంకర్
స్టోరీ, డైరెక్షన్ – రాహుల్ సంకృత్యన్
కో ప్రొడ్యూసర్స్- అనురాగ్ పర్వతనేని, శివ్ చనన
సీఈవో – చెర్రి
మ్యూజిక్ – అజయ్ – అతుల్
డీవోపీ – నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ
రైటర్ – ప్రమోద్ తమ్మినేని
ప్రొడక్షన్ డిజైనర్ – శివం రావు నాగసాని
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్ ఆర్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఆర్ చంద్రశేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చెంబోలు సాయి ఆదిత్య
కొరియోగ్రఫీ – కృతి మహేశ్
కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చన రావు
ఆర్ట్ డైరెక్టర్ – విఠల్ కోసనం
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – సునీల్ రాజు చింత
యాక్షన్ కొరియోగ్రాఫర్స్ – యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు
సౌండ్ డిజైనర్ – రఘునాథ్ కెమిశెట్టి
పబ్లిసిటీ డిజైనర్ – కబిలన్ చెల్లయ్య
పీఆర్ఓ – సురేష్ ( ఎస్ కె మీడియా )
మార్కెటింగ్ – ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.