మోగ్లీ’ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది – దర్శకుడు సందీప్ రాజ్
జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ మూవీని టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు సందీప్ రాజ్ మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి ఆయన చెప్పిన విశేషాలివే.. ప్రస్తుతం మీరు నటుడిగా ఎక్కువ కనిపిస్తున్నారు? మీకు డైరెక్షన్, యాక్టింగ్‌లో ఏదంటే ఎక్కువ ఇంట్రెస్ట్? నాకు ముందుగా నటన అంటేనే ఇష్టం. ‘చాయ్ బిస్కెట్’లో ఉన్నప్పుడు కథలు కూడా రాసేవాడ్ని. అలా ‘అతిథి’ అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ తరువాత దర్శకుడిగా నాకు అవకాశాలు స్టార్ట్ అయ్యాయి. అడ్వాన్స్‌లు…
