‘సింగ్ గీతం’ పదేళ్ల తర్వాత కూడా గుర్తుండే సినిమా: నిర్మాత నాగ్ అశ్విన్
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన 'సింగ్ గీతం' టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత నాగ్ అశ్విన్ విలేకర్ల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. 'సింగ్ గీతం' ప్రయాణం ఎప్పుడు మొదలైంది? -ఈ ప్రయాణం సింగీతం గారితోనే మొదలైంది. ఆయన…
