“రణబాలి” జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు నిత్యావసర వస్తువులు అందించిన రశ్మిక
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా కార్యక్రమాలతో తన గొప్ప మనసు చాటుకుంటున్నారు హీరోయిన్ రశ్మిక మందన్న. తన కొత్త సినిమా రణబాలిలో జయమ్మ పాత్ర స్ఫూర్తిగా రశ్మిక అన్నపూర్ణ అనే సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా 8 వివిధ ప్రాంతాలకు చెందిన 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించారు. ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తానని ఆమె వెల్లడించారు. రశ్మిక చేపట్టిన అన్నపూర్ణ ప్రాజెక్ట్ పట్ల విజయ్ దేవరకొండ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రశ్మికను చూస్తుంటే గర్వంగా ఉందంటూ స్పందించారు. మరోవైపు నెటిజన్స్ పెద్ద సంఖ్యలో రశ్మిక…
