వరల్డ్‌వైడ్‌గా రూ.150 కోట్లు దాటిన ‘ఇరుముడి’ గ్రాస్
మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తోంది. అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా రెండో వారంలోనూ స్ట్రాంగ్ కలెక్షన్స్ నమోదు చేస్తోంది. వీకెండ్‌లో వసూళ్లు మరింతగా పెరిగాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన జోరును కొనసాగిస్తోంది. ఇప్పటికే ‘ఇరుముడి’ వరల్డ్‌వైడ్‌గా రూ.150 కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసింది. రవితేజ కెరీర్‌లో ఇదొక మైలురాయి కావడం విశేషం. ఈ సెన్సేషనల్ రన్‌లో నైజాం ఏరియా కీలకంగా నిలిచింది. అక్కడ రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మిగతా ఏరియాల్లోనూ సినిమా ఇంప్రెసివ్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా రీజినల్ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా ‘ఇరుముడి’ నిలిచింది. అలాగే నిర్మాతలు,…
