అల్లు అర్జున్ ఫ్రెండ్‌షిప్ డే సందేశం
నిజమైన విజయమంటే మన స్నేహితులను కూడా మనతో పాటు ముందుకు తీసుకెళ్లడమే.. సినిమా రంగంలో విజయం మన చుట్టూ ఉన్న చాలా విషయాలను మార్చేస్తుంది. ఈ క్రమంలో మన కెరీర్‌లు మారుతాయి. మన బంధాలు, సంబంధాల సమీకరణాలు మారిపోతాయి. స్నేహాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అయితే నిజమైన విజయం అంటే కేవలం అత్యుతన్న స్థానాన్ని చేరుకోవడం మాత్రమే కాదని..మనవాళ్లను కూడా మనతో పాటు తీసుకెళ్లడమే అని గుర్తు చేసే వారుంటారు. అలాంటి అరుదైన వ్యక్తే అల్లు అర్జున్. ఆయన ఎలాంటి హంగామా లేకుండా నిశ్శబ్దంగా అదే చేసి చూపించారు. కొన్ని నెలల క్రితం అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో AA23 చిత్రాన్ని ప్రకటించినప్పుడు, సహజంగానే అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్ భారీ…
