Skip to content

డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణలో గాయపడిన రశ్మిక మందన్న

డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా హీరోయిన్ రశ్మిక మందన్న తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె రణబాలి, మైసా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. రణబాలి, మైసా చిత్రాల్లో వరుసగా యాక్షన్ సీక్వెన్సులు, డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ లు చేయడం వల్ల రశ్మిక హిప్ ఏరియాలో పూర్తిగా టెండన్ డిటాచ్ మెంట్ అయ్యింది. ఆమె గాయం వైద్యులను సైతం షాక్ కు గురి చేసింది. తీవ్రంగా సాధన చేసే క్రీడాకారుల్లో మాత్రమే ఇలాంటి గాయాలు అవుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. రశ్మిక 6 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. టెండన్ తిరిగి బలపడేందుకు రీహాబిలిటేషన్ కూడా అవసరం అని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రశ్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో బిజీయెస్ట్…

Read more

ఘనంగా “నిరమ్” ట్రైలర్, ఆడియో లాంఛ్

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న మూవీ ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "నిరమ్". ఈ చిత్రాన్ని కె. స్క్వేర్ సినిమాస్ సమర్పణలో యూనిట్ ఆఫ్ కె స్క్వేర్ వెంచర్స్ బ్యానర్ పై కె. బిందుమాధవి నిర్మిస్తున్నారు. పి.రాజేష్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సరికొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ దర్శకుడు బలరామ్ కృష్ణ రూపొందిస్తున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "నిరమ్" సినిమా తెలుగు ట్రైలర్, ఆడియో లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ భారతీబాబు మాట్లాడుతూ - ఈ చిత్రంలో నేను…

Read more

స్పైడర్-మ్యాన్‌తో అల్లు అర్జున్ క్రేజ్

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్ (భారతదేశంలోనే అతిపెద్ద, అత్యాధునిక డాల్బీ సినిమా స్క్రీన్)లో గ్రాండ్ ప్రీమియర్ నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రీమియర్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలతో కలిసి హాజరై సందడి చేశారు. అభిమానులు ఈ అరుదైన ఫ్యామిలీ మూమెంట్‌ను ఆసక్తిగా స్వాగతించగా, సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ వేడుకకు అల్లు అరవింద్, అల్లు శిరీష్, బన్నీ వాస్, దర్శకులు చందూ మొండేటి, సాయి రాజేష్, హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, నటి రష్యా గోరక్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి, హారిక & హాసిని…

Read more

‘టాక్సిక్’ నుంచి కియారా అద్వానీ బర్త్‌డే పోస్టర్ రిలీజ్

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న 'టాక్సిక్' నుంచి కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్, కియారా బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. అద్భుతమైన డిజైన్‌తో రూపొందించిన ఎరుపు రంగు దుస్తుల్లో కియారా అద్వానీ ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆమె చూపులు, బోల్డ్ రూబీ లిప్స్, రాయల్ లుక్ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్లామర్‌కే పరిమితం కాకుండా, 'నాదియా' పాత్రలో కాన్ఫిడెన్స్, మిస్టరీ దాగి ఉన్న…

Read more

‘సర్దార్ 2’ టీజర్ రిలీజ్

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రాగా, తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. "శాంతం... శాంతం... శాంతమే ప్రశాంతం... ఒక పొడుపు కథ చెబుతాను..." అంటూ ఎస్.జే. సూర్య పవర్‌ఫుల్ వాయిస్‌తో టీజర్…

Read more

హైదరాబాద్‌లో ఎకో సస్టెయిన్–ఐపీఈసీ ఎక్స్‌పో ప్రారంభం

వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర పారిశ్రామిక అభివృద్ధి, వనరుల సమర్థ వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న 3వ ఎకో సస్టెయిన్ ఎక్స్‌పో & కాన్ఫరెన్స్ మరియు 5వ ఐపీఈసీ ఎక్స్‌పో & కాన్ఫరెన్స్ గురువారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శన ఆగస్టు 1 వరకు కొనసాగనుంది. తెలంగాణ పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ (ఎంఎస్‌ఎంఈ) కె. మధుకర్ బాబు, ఏస్ అర్బన్ గ్రూప్ & ఏఎం గ్రీన్ డైరెక్టర్ స్వాతి చలమలశెట్టి, ఐఈడీఎస్ & జాయింట్ డైరెక్టర్ (హెచ్‌ఓఓ) సి.ఎస్.ఎస్. రావు, రిచ్ తెలంగాణ సీఈఓ రష్మి పింపాలే, సీఐపీఈటీ హైదరాబాద్ ప్రిన్సిపల్ డైరెక్టర్ బి. రవి, ఎఫ్‌ఎస్‌ఎంఈ జాతీయ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ రెడ్డి…

Read more

‘కాళాంకి భైరవుడు’నుంచి ‘ఏంటో ఏమో’ పాట విడుదల

విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్ 'కాళాంకి భైరవుడు' ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించనుంది. దర్శకుడు హరిహరన్.వి తన ప్రత్యేక కథన శైలితో ఈ చిత్రాన్ని రూపొందించారు. గాయత్రీ ప్రొడక్షన్స్, రాచమల్ల బ్రదర్స్ బ్యానర్లపై కె.ఎన్.రావు, డా. రాచమల్ల శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని నిర్మించగా, పీ.ఆర్. సంగీతం సమకూర్చారు. ఇందులో రాజశేఖర్ వర్మ ప్రధాన పాత్రలో నటించగా, రితికా చక్రవర్తి, పూజ కిరణ్, భవ్యశ్రీ ఇతర కీలక పాత్రలను పోషించారు. ఇటీవల జరిగిన టీజర్ లాంచ్ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ ముఖ్య అతిథిగా…

Read more

నేను ప్రేమికుడ్ని చిత్ర ఫస్ట్ లుక్ విడుదల

ఆల్మైటి క్రియేషన్స్ బ్యానర్ లో శ్రీ వి చిన్న శ్రీశైలం యాదవ్ సమర్పణలో వడిగేపల్లి కృష్ణ నిర్మాతగా వి రమేష్ యాదవ్, కాకర్లమూడి రామకృష్ణ సహా నిర్మాతలుగా రామ్ భారధరం దర్శకత్వంలో దేవరపల్లి రేవంత్ ఎల్సా ఘోస్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న చిత్రం నేను ప్రేమికుడ్ని నేను ప్రేమికుడ్ని చిత్ర ఫస్ట్ లుక్ కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి నేను ప్రేమికుడ్ని ఫస్ట్ లుక్ విడుదల చేశారు ఈ సందర్బంగా కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ‘మంచి కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలి అన్నారు. హీరో రేవంత్ దేవరపల్లి మాట్లాడుతూ ’లవ్, హారర్ ఎలిమెంట్స్…

Read more

రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘లెనిన్’

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మొదటి రోజు నుంచే ‘లెనిన్’ రికార్డుల్ని సృష్టించడం ఆరంభమైంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఏకంగా వంద కోట్ల క్లబ్బులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఇప్పటి వరకు వంద కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టిందని మేకర్స్ అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘లెనిన్’ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు అందించిన కథ, కథనం అన్నీ కూడా సినిమాకి…

Read more

నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ‘పోలీస్ కంప్లైంట్’ స్ట్రీమింగ్

▪️తెలుగు, కన్నడ భాష‌ల్లో జూన్‌లో విడుద‌లైన చిత్రం ▪️ 300 థియేట‌ర్‌ల‌లో విడుద‌లై హిట్ టాక్ హారర్-యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్‌లో థియేటర్లలో విడుదలై మంచి స్పందనతో పాటు సానుకూల సమీక్షలు అందుకున్న ఈ చిత్రం, ఈ శుక్ర‌వారం (జూలై 31) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, కన్నడ భాష‌ల్లో దాదాపు 300 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విడుదలైన తొలి రోజు నుంచే హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి…

Read more