‘రామాయణ’ ట్రైలర్ కు రెండు రోజుల్లోనే 350+ మిలియన్ల వ్యూస్
రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా, నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ: పార్ట్ 1' ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే అధికారిక ప్లాట్‌ఫార్మ్‌లలో 350 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందనతో ఈ చిత్రం 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ట్రైలర్‌కు సినీ అభిమానులు, విమర్శకులు, సెలబ్రిటీలు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా భారీ స్థాయి విజువల్స్, వరల్డ్ క్లాస్ VFX, భావోద్వేగభరితమైన కథనం, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా "Our Truth. Our History." అనే…
