క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ మే 28న…
జూన్ 19న అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ రిలీజ్ కానున్న “బాలన్ – ది బాయ్”
గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “బాలన్ – ది బాయ్”. ఈ చిత్రానికి “ఆవేశం” ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో “మంజుమ్మెల్ బాయ్స్” చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జూన్ 19న హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
“బాలన్ – ది బాయ్” సినిమాను ఏపీ, తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పంపిణీ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ రోజు మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ తో కొలాబ్రేట్ అవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా “బాలన్ – ది బాయ్” సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ప్రేక్షకుడికి చేరువ కానుంది. ఈ సినిమా ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవలే “బాలన్ – ది బాయ్” మూవీ ఫ్రాన్స్ లో జరిగే ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమై, గ్లోబల్ వేదికపై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మన నేటివిటీతో సాగే కథా కథనాలతో యూనివర్సల్ గా ప్రతి ఆడియెన్ మనసును హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు చిదంబరం తెరకెక్కిస్తున్నారు. థియేటర్స్ లో తప్పక చూడాల్సిన చిత్రమిది అంటూ మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.
నటీనటులు – చందు సలీమ్ కుమార్ తదితరులు
టెక్నికల్ టీమ్
—————-
ఎడిటర్ – వివేక్ హర్షన్
డీపీవో – షైజు ఖాలిద్
మ్యూజిక్ – సుషిన్ శ్యామ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన – జితూ మాధవన్
నిర్మాతలు – వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్
దర్శకత్వం – చిదంబరం

