Skip to content

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న ఆటిట్యుడ్ స్టార్ చంద్రహాస్ ‘బరాబర్ ప్రేమిస్తా’

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న ఆటిట్యుడ్ స్టార్ చంద్రహాస్ ‘బరాబర్ ప్రేమిస్తా’ Telugu News

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ నటించిన రీసెంట్‌ హిట్ సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంతో వచ్చిన ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ కథానాయికగా నటించారు. అర్జున్ మహీ (‘ఇష్టంగా’ ఫేమ్) విలన్‌గా మెప్పించారు. ‘బారాబర్ ప్రేమిస్తా’ మూవీని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ సంస్థల మీద గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మించారు. ఈ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

థియేటర్లో మంచి హిట్ దక్కించుకున్న తరువాత రీసెంట్‌గానే ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ‘బరాబర్ ప్రేమిస్తా’ సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ‘బరాబర్ ప్రేమిస్తా’ అమెజాన్‌లో టాప్ పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. చంద్రహాస్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌కి మంచి స్పందన వస్తోంది.

ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీకి కథని ఎంఏ తిరుపతి, మాటలు రమేష్ రాయ్ అందించారు. వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా, ఆర్ఆర్ ద్రువన్ సంగీత దర్శకుడిగా పని చేశారు, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.