“ఐకానిక్ సినిమాటోగ్రాఫర్”అవార్డు అందుకున్న “కిషోర్ బొయిదాపు”
"పారితోషికం కంటే పనిలో సంతృప్తి"కి ప్రాధాన్యత కిషోర్ బొయిదాపు ప్రత్యేకత!! ప్రముఖ హీరోయిన్ హన్సిక మోత్వాని నటించిన "105 మినిట్స్" చిత్రానికిగాను... సినిమాటోగ్రఫీ విభాగంలో "ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్" ఆదుకున్నారు టాలెంటెడ్ యువ కెమెరామెన్ కిషోర్ బొయిదాపు. పరిమిత బడ్జెట్ లో సింగిల్ క్యారక్టర్ తో.. సింగిల్ షాట్ లో తెరకెక్కి ఉండడం "105 మినిట్స్" సినిమా ప్రత్యేకత. హైద్రాబాద్ లో నిన్న (జూన్ 27, 2025) లీ-మెరిడియన్ హోటల్ లో కోలాహలంగా జరిగిన వేడుకలో కిషోర్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. ఈసందర్భంగా "105 మినిట్స్" చిత్ర దర్శకులు రాజు దుస్సా, నిర్మాత బొమ్మక్ శివలకు కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు! రవిప్రసాద్ యూనిట్ లో కెమెరా అసిస్టెంట్ గా తన కెరీర్…