‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి మీసాల పిల్ల సాంగ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ ప్రోమోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ వీడియో రికార్డ్ వ్యూస్‌ను సాధించింది, ఇప్పటికే లెక్కలేనన్ని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తో సంచలనం సృష్టించింది. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను శ్రీమతి అర్చన గర్వంగా సమర్పిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మీసాల పిల్ల లిరికల్ వీడియో విడుదలైంది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ట్రాక్ పవర్ ఫుల్ ఎలక్ట్రానిక్ బీట్స్, పంచ్ బాస్…
