‘విష్ణు విన్యాసం’ సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది: నయన్ సారిక
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్ 'విష్ణు విన్యాసం'తో అలరించబోతున్నారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇపటికే ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ నయన్ సారిక విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ? చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్ కి చాలా షేడ్స్ వుంటాయి. కొంచెం ఫీమేల్ డామినేటింగ్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ లో…
