Skip to content

‘పవర్‌పేట’ నుంచి రితికా నాయక్ ఫస్ట్ లుక్ రిలీజ్

సందీప్ కిషన్ హీరోగా, కృష్ణ చైతన్య రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘పవర్‌పేట’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నేతృత్వంలోని సక్సెస్‌ఫుల్ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇంటెన్స్ క్యారెక్టర్లు, డ్రామాతో కూడిన పవర్‌ఫుల్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే మేకర్స్ సందీప్ కిషన్‌ను సేనాపతి రవిగా పరిచయం చేస్తూ పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ప్రేమ, గౌరవం, రాజకీయాల కలయికగా ఈ కథ ఉండబోతోందనే ఆసక్తిని ఆ గ్లింప్స్ కలిగించింది. వరుస బ్లాక్‌బస్టర్స్ ‘మిరాయ్’, ‘కొరియన్ కనకరాజు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రితికా నాయక్.. ‘పవర్‌పేట’లో సందీప్ కిషన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. రితికా నాయక్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్…

Read more

‘అలియాస్ రుక్మిణి’ నుంచి ‘రుక్కు రుక్కు రుక్మిణి’ సాంగ్ రిలీజ్

బ్లాక్‌బస్టర్ సక్సెస్ 'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. 'అలియాస్ రుక్మిణి' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మాణంలో ప్రేమ, హాస్యం కలగలిసిన కథతో రూపొందుతున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మేకర్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘రుక్కు రుక్కు రుక్మిణి’ లవ్ సాంగ్ ను విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ పాట వినసొంపైన మెలోడీతో ఆకట్టుకుంటోంది. ఆహ్లాదకరమైన ట్యూన్స్‌కు గిటార్, వయోలిన్‌తో కూడిన చక్కని ఆర్కెస్ట్రేషన్ తోడవడంతో పాటకు మంచి రొమాంటిక్ ఫీల్ వచ్చింది…

Read more

తిరుమలలో కళాకారులతో కోలాటం ఆడిన నందమూరి ఫ్యామిలీ

తిరుమలలో ప్రతినెలా శ్రీవారి మహోత్సవం తరువాత గరుడోత్సవం ఘనంగా జరుగుతుంటుంది. ఈసారి కూడా ఎంతో ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి మోహన కృష్ణ, నందమూరి సీమ, నందమూరి రూప, నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. గరుడ వాహనానికి హారతి పట్టిన తరువాత అక్కడ ఉన్న కళాకారులతో కోలాటం ఆడి, స్థానికులను మెప్పించారు. అనంతరం అక్కడ స్థానిక హోటల్ లో ఎన్టీఆర్ రాజు, శ్రీధర్ వర్మ, ఇంకా సాధారణ ప్రజలతో కలిసి టిఫిన్ చేశారు. గతంలో కూడా నందమూరి మోహన కృష్ణ గారు అన్నదాన ట్రస్ట్ కి విరాళాలు అందించారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.తమకు తిరుమలతో ఉన్న అనుబంధాన్ని…

Read more

కమెడియన్ రామచంద్రకు అండగా నటుడు అయినాబత్తిన దశరధ

మానవత్వాన్ని చాటుకున్న దశరధ.. ‘కిల్లర్’ సినిమా విజయానికి రామచంద్ర శుభాకాంక్షలు తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న అయినబత్తిన దశరధ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ‘వెంకీ’ సినిమా ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన కమెడియన్ రామచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న దశరధ, ఆయనను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రామచంద్రకు దశరధ ధైర్యం చెప్పారు. తోటి కళాకారుడి కష్టాన్ని అర్థం చేసుకుని, తన వంతు సహాయం అందించడం ద్వారా మానవత్వమే నిజమైన గొప్పతనమని చాటుకున్నారు. ఈ సందర్భంగా దశరధ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర కళాకారులంతా ఒక కుటుంబంలా ముందుకొచ్చి…

Read more

“కిల్లర్” సినిమా చూశాక థ్రిల్ అవుతారు – పూర్వాజ్

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ "కిల్లర్". ఈ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. "కిల్లర్" సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోంది. ఓవర్సీస్ లో "కిల్లర్" మూవీని ఓఎంజి పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో…

Read more

నవంబరు 12న విడుదల కానున్న ‘అ’

రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'అ' (‘AH) ’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. అడివి శేష్ విడుదల చేసిన సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన రావడంతో పాటు. ‘బ్లడీ హంగర్’ పేరుతో విడుదల చేసిన ఈ చిత్రం గ్లింప్స్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇటీవల విడుదల చేసిన ఇదేనా ఇదేనా అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మొదట అక్టోబర్‌ 30న థియేట్రికల్‌ చేయాలనుకున్నారు. అయితే ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ కానీ ఈ చిత్ర మేకర్స్ చిత్రాన్ని నవంబరు 12న గ్రాండ్‌గా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ…

Read more

ఇకపై నటనపైనే దృష్టి- కె. దివ్యవాణి

సినిమా రంగంలో "బాపు బొమ్మ"గా... టివి రంగంలో "పుత్తడిబొమ్మ"గా సుప్రసిద్ధురాలైన దివ్యవాణి... రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. మరోవైపు "పే బ్యాక్ టు సొసైటీ" అనే నినాదం స్పూర్తితో సమాజానికి తన వంతు సేవా కార్యక్రమాలు విరివిగా చేస్తున్నారు. అయితే ఇకపై రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ సినిమా రంగంపై దృష్టి సారించాలని దృఢ నిశ్చయం తీసుకున్నానని చెబుతున్నారు! "పెళ్ళి పుస్తకం, ఎదురింటి మొగుడు - పక్కింటి పెళ్ళాం" వంటి చిరస్మరణీయ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిర స్థానం సంపాదించుకున్న దివ్యవాణి... "పుత్తడి బొమ్మ" టివి సీరియల్ తోనూ ఉర్రూతలూగించారు. అంతేకాదు... కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించి... అక్కడి ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన ఈ అందాల భామ... కన్నడ అనర్గళంగా మాట్లాడతారు. ఈ…

Read more

“చంద్రయాన్” సినిమా రాకెట్ రివీల్ ఈవెంట్‌కు అతిథిగా డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి

నవంబర్ 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న హిలేరియస్ అడ్వెంచర్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో "చంద్రయాన్" టైటిల్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిలేరియస్ అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కిన "చంద్రయాన్" సినిమా నవంబర్ 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు "చంద్రయాన్" సినిమా రాకెట్ రివీల్ ఈవెంట్ ను…

Read more

‘వృషకర్మ’ ఏపీ, తెలంగాణ, కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ను ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్న దిల్ రాజు SVC

యువ సామ్రాట్ నాగచైతన్య ప్రతిష్టాత్మక మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా ‘వృషకర్మ’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో దిల్ రాజు అసోసియేషన్ సినిమాపై ఆయనకున్న నమ్మకాన్ని, ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌పై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది. ఈ…

Read more

‘ఓం’ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సాయిపల్లవి

వెర్స‌టైల్ స్టార్ హీరో ధనుష్ క‌థానాయ‌కుడిగా.. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న‌ భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓం – చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్’ నుంచి హీరోయిన్‌ సాయిపల్లవి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో విడుదలైంది. ఈ సినిమాలో ఆమె నిత్యారెడ్డి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో సాయిపల్లవి ఆకట్టుకుంటున్నారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆమె తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి పాత్ర విష‌యానికి వ‌స్తే.. నిత్యారెడ్డి తెలివితేటలు, నిజాయతీ, అనుభవం ఉన్న యువ పోలీస్ ఆఫీసర్‌గా పరిచయమైంది. గతంలో సీబీఐ, ఇంటర్‌పోల్‌లో పనిచేసిన ఆమె.. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్…

Read more