#VenkyAnil5 (#NkrAR2)- షూటింగ్‌లో జాయిన్ అయిన వెంకటేష్
విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 (#NKRAR2) చిత్రం కోసం జతకట్టారు. 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై సాహు గారపాటి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కల్యాణ్ రామ్ పుట్టినరోజున విడుదలైన ఆయన 'ఫస్ట్-లుక్' పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. కల్యాణ్ రామ్, ఇతర నటీనటులపై చిత్రీకరించిన ఒక పాట షూటింగ్‌ను చిత్ర బృందం ఇటీవల పూర్తి చేసింది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా పాల్గొంటున్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్ షూటింగ్ సెట్‌లో చేరారు. ప్రస్తుతం ప్రధాన తారాగణంతో కూడిన కీలక సన్నివేశాలను…
