ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!
ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం చాలా అరుదుగా మాత్రమే చూస్తాం. C సెంటర్ల నుంచి పెద్ద పెద్ద సెంటర్ల వరకు అన్ని థియేటర్లలో షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ఒకప్పుడు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో విజయశాంతి గారు నటించిన ఓసే రాములమ్మ సినిమాకు జనాలు బండ్లు కట్టుకుని వచ్చి, రాత్రిళ్లు కూడా థియేటర్ల దగ్గర కాపలాలు కాసి సినిమా చూసిన రోజులను నేను చూశాను. అప్పుడు థియేటర్ల దగ్గర కనిపించిన ఆ జనసందోహం, ఆ ఉత్సాహం మళ్లీ ఇప్పుడు ఇరుముడి సినిమాకు కనిపిస్తోంది. ఫ్యామిలీస్‌తో కలిసి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్నారు. ఒక్క షో కూడా…
