ఆద్యంతం వినోదభరితంగా ‘పురుష:’ ట్రైలర్.. మే 22న చిత్రం విడుదల
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తరువాత జీవితం యుద్ధభూమిలా మారుతుంది’ అని వెన్నెల కిషోర్ డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత వచ్చే సీన్లు, భార్యల చేతిలో భర్తలు నలిగిన తీరు అందరినీ…
