‘రంభ ఊర్వశి మేనక’ ఫుల్ లెంత్ ఎంటర్ టైనర్: దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ
అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నా కంటి మీద కనులే’ పాట, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘రంభ ఊర్వశి మేనక’ టైటిల్ చాలా గమ్మత్తుగా ఉంది. ఈ టైటిల్ వెనుక ఉన్న కథ ఏమిటి? -సక్సెస్ కోసం ప్రతి ఒక్కరం చాలా ఆత్రుతగా…
