‘RaPo23’ కోసం 24 గంటలు పాటు ఏకధాటిగా షూట్ చేసిన రామ్ పోతినేని
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘RaPo23’ కోసం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇటీవల పుదుచ్చేరి శివార్లలో రామ్ ఏకంగా 24 గంటల పాటు నిర్విరామంగా షూట్ చేశారు. విశేషం ఏమిటంటే రామ్ కేవలం డైరెక్టర్‌గా కెమెరా వెనుక ఉండటమే కాకుండా హీరోగా కూడా నటిస్తున్నారు. పుదుచ్చేరిలో ఈ సినిమా కోసం భారీ సెటప్ వేశారు. దాదాపు 9 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్‌లో రామ్ నటుడిగా తనపై ఉన్న బాధ్యతతో పాటు, దర్శకుడిగా సినిమా ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తూ శ్రమిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘RaPo23’ ప్రస్తుతం అందరిలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అనూహ్యంగా కురిసిన వర్షాల కారణంగా…
